- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ram Gopal Varma: ఆమెతో రామ్ గోపాల్ వర్మ డేటింగ్.. నెట్టింట షాకింగ్ వీడియో వైరల్
టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టివ్‌గా ఉంటున్నారు

దిశ, సినిమా: టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టివ్‌గా ఉంటున్నారు. పలు పోస్టులు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఆయనకి దివంగత హీరోయిన్ శ్రీదేవి(Sridevi) అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమెపై తన ప్రేమను చూపిస్తూ ఊహించని విధంగా పోస్టులు పెడుతుంటారు.
తాజాగా, రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశాడు. ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence) క్రియేటర్ ఏఐతో శ్రీదేవితో రామ్ గోపాల్ వర్మ డేటింగ్ చేస్తున్నట్లు ఓ వీడియో క్రియేట్ చేయగా.. దానిని ట్విట్టర్‌లో పెట్టాడు. హాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ అందుకున్న ది సబ్‌స్టాన్స్(The Substance) సినిమాలోని సన్నివేశాన్ని ఉపయోగించి వీడియో చేశాడు. ఇందులో మీరు ఎప్పుడైనా బెటర్ వెర్షన్‌గా ఉండాలని కోరుకున్నారా.
మరింత అందంగా, బ్యూటీఫుల్‌గా ఉండాలని అనుకున్నారా అంటూ డెమి మూర్ వెర్షన్‌లో శ్రీదేవిని పెట్టారు. అలాగే రామ్ గోపాల్ వర్మ ఆమెతో మాట్లాడుతున్నట్లు దానికి శ్రీదేవి నవ్వుతున్నట్లు క్రియేట్ చేశారు. అంతటితో ఆగకుండా ఇందులోకి ఆమె పెద్ద కూతురు జాన్వీ కపూర్(Janvi Kapoor)ను కూడా యాడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అంతా షాక్ అవుతున్నారు.
A I is becoming TOO MUCH 😳😳😳 pic.twitter.com/p8nsog9wmr
— Ram Gopal Varma (@RGVzoomin) January 12, 2025






