- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ram Gopal Varma: హారర్ మూవీ ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ.. భయంకరంగా ఆకట్టుకుంటున్న పోస్టర్
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇన్నాళ్లకు మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు.

దిశ, సినిమా: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇన్నాళ్లకు మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. 90'sలోనే దెయ్యం అనే చిత్రంతో ఇండియన్ సినిమాకు హారర్ జానర్‌లో ఓ కొత్త కంటెంట్‌ను పరిచయం చేసి.. ప్రేక్షకులను భయభ్రాంతులకు గురిచేశాడు వర్మ. మళ్లీ ఇన్నాళ్లకు మరోసారి ఓ హారర్ చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. దీని కోసం బాలీవుడ్ యాక్టర్ మనోజ్ బాజ్ పేయితో చేతులు కలిపాడు. మరోజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి కాగా.. తాజాగా టైటిల్‌ను అనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశాడు వర్మ.
‘ఒక భయంకరమైన గ్యాంగ్‌స్టర్‌ను ఎన్‌కౌంటర్ చేసి చంపిన పోలీస్.. అతను పోలీస్ స్టేషన్‌ను వెంటాడేందుకు దెయ్యంలా తిరిగి వస్తాడు .. అందుకే ‘పోలీస్ స్టేషన్ మే భూత్’ అనే టైటిల్ వచ్చింది. చనిపోయిన వారిని మీరు అరెస్టు చేయలేరు’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. You Can’t Arrest The Dead (చనిపోయిన వాళ్లను అరెస్ట్ చెయ్యలేరు) అనే క్యాప్షన్‌తో తెరెకెక్కబోతున్న ఈ మూవీ టైటిల్ పోస్టర్‌లో మనోజ్ బాజ్ పేయితో పాటు ఓ దెయ్యం బొమ్మ ఉండగా.. ఇది నీ కెరీర్‌లో ది బెస్ట్ హారర్ మూవీ కావాలి, ఆర్‌జీవి ఈజ్ బ్యాక్ అనే కామెంట్స్‌తో సందడి చేస్తున్నారు నెటిజన్లు. ఈ సినిమాలో మనోజ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా.. ఆయనకు జోడీగా జెనీలియా నటిస్తుంది. ఇక చాలా గ్యాప్ తర్వాత ఆర్‌జీవి, మనోజ్ కాంబినేషన్‌లో ఈ చిత్రం రాబోతుండగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.






