Peddhi: ‘పెద్ది’ మ్యూజికల్ జర్నీ స్టార్ట్.. వైరల్ అవుతున్న అప్డేట్‌తో ఆనందంలో మెగా ఫ్యాన్స్!

by Chukka Sudharani |   (  Updated:2025-07-26 14:54:24  IST  )

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘పెద్ది’.

Peddhi: ‘పెద్ది’ మ్యూజికల్ జర్నీ స్టార్ట్.. వైరల్ అవుతున్న అప్డేట్‌తో ఆనందంలో మెగా ఫ్యాన్స్!
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘పెద్ది’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన గ్లింప్స్ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో మూవీపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. దీంతో ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఈ క్రమంలోనే తాజాగా పెద్ది నుంచి లేటెస్ట్ అప్డేట్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు సంబంధించిన మ్యూజికల్ జర్నీ త్వరలో స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ రెడీ అయినట్లు టాక్.

వినాయక చవితి స్పెషల్‌గా ఈ ఆగస్టు లాస్ట్ వీక్‌లో ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయనున్నారట మేకర్స్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్‌లు వైరల్ అవుతుండగా.. మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. డైరెక్టర్ బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య ‘పెద్ది’ మూవీ వచ్చే ఏడాది 27న ప్రేక్షకుల రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Next Story