- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉగాదికి రామ్ చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) - బుచ్చిబాబు(Buchi Babu) కాంబినేషన్‌లో పెద్ది చిత్రం(Peddi Movie) వస్తోన్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) - బుచ్చిబాబు(Buchi Babu) కాంబినేషన్‌లో పెద్ది చిత్రం(Peddi Movie) వస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవలే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. ఊరమాస్‌లో లుక్‌లో చరణ్ దర్శనమివ్వడంతో ఫ్యాన్స్ తెగ మురిసిపోయారు. ఇక ఉగాది(Ugadi) పండక్కి పెద్ది చిత్రబృందం మరో ట్రీట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. పండుగరోజున పెద్ది చిత్రం గ్లింప్స్ విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం వస్తుండటంతో రంగస్థలంకు మించి ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.
మరోవైపు ఇటీవలే తమిళ అగ్రదర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన గేమ్ ఛేంజర్ అనుకున్న స్థాయిలో రాణించలేదు. అంతకుముందు ఆచార్య కూడా నిరాశ పర్చింది. దీంతో మెగా అభిమానులతో పాటు చరణ్ ఫ్యాన్స్ కూడా పెద్ది చిత్రంపైనే ఆశలు పెట్టుకున్నారు. జాన్వీ కపూర్(Janhvi Kapoor) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సమర్పిస్తున్నాయి. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. క్రీడా నేపథ్యంలో, మూలాల్ని ఆవిష్కరించే ఓ గ్రామీణ కథగా ఈ చిత్రం రూపొందుతున్నట్టు సమాచారం. గుర్తింపు కోసమే పెద్ది పోరాటం చేస్తాడని రామ్‌చరణ్ సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజున పేర్కొన్నారు.






