Ram Charan: పెద్ది తదుపరి షెడ్యూల్‌పై బిగ్ అప్డేట్.. అక్కడ రామ్ చరణ్, జాన్వీలపై షూట్

by Chukka Sudharani |

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా గ్రామీణ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ జెట్ స్పీడ్‌తో నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

Ram Charan: పెద్ది తదుపరి షెడ్యూల్‌పై బిగ్ అప్డేట్.. అక్కడ రామ్ చరణ్, జాన్వీలపై షూట్
X

దిశ, సినిమా: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా గ్రామీణ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ జెట్ స్పీడ్‌తో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం దూసుకుపోతున్న ఈ చిత్రానికి సంబంధించిన బిగ్ అప్డేట్ వచ్చింది. తాజాగా రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సనాతో పాటు ఇతర బృంద సభ్యులు ‘పెద్ది’ తదుపరి షూటింగ్ షెడ్యూల్ కోసం శ్రీలంకకు బయలుదేరారు. ఈ షూటింగ్ ద్వీపంలోని సుందరమైన ప్రదేశాల మధ్య జరుగుతుంది. ఇక్కడ రామ్ చరణ్, జాన్వీ కపూర్‌లపై ఓ బ్యూటీఫుల్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు మేకర్స్.

అకాడమీ అవార్డు గ్రహీత ఎఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. దీనిని బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో.. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ ఓ కీలక పాత్ర పోషిస్తుండగా.. జగపతి బాబు, దివ్యేందు శర్మ కూడా ప్రముఖ తారాగణంలో ఉన్నారు. పెద్ది మార్చి 27, 2026న గ్రాండ్ పాన్-ఇండియా థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది.

Next Story