- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ram Charan: నెవర్ బిఫోర్‌గా రామ్ చరణ్ నెక్ట్స్ మూవీ క్లైమాక్స్.. హైప్ పెంచేస్తు్న్న న్యూస్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రజెంట్ బుచ్చి బాబు డైరెక్షన్‌లో ‘RC16’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రజెంట్ బుచ్చి బాబు డైరెక్షన్‌లో ‘RC16’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ (Sports backdrop)లో తెరకెక్కుతోందని తెలుస్తుండగా.. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ ఏడాది భారీ అంచనాలతో వచ్చిన ‘గేమ్ చేంజర్’ సినిమా ఊహించిన ఫలితం దక్కకపోవడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ ‘RC16’ ఆశలు పెట్టుకున్నారు. దీంతో ఈ సినిమాపై ఏ అప్‌డేట్ వచ్చిన అది క్షణాల్లో వైరల్‌గా మారుతోంది. ఈ క్రమంలోనే ‘RC16’ కి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాకు వర్క్ చేస్తోన్న సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తాజాగా సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. ‘నైట్ షూట్, ఫ్లడ్ లైట్స్, క్రికెట్ పవర్, డిఫరెంట్ యాంగిల్స్’ అనే క్యాప్షన్ ఇచ్చి క్రికెట్ స్టేడియంలో ఉండే లైట్‌ల ఫొటోను పంచుకోగా.. ప్రజెంట్ ఈ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
అంతే కాకుండా ఈ సినిమాకు మరో ఇంట్రెస్టింగ్ బజ్ కూడా వినిపిస్తుంది. ‘RC16’ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ నెవర్ బిఫోర్ (Climax Never Before) అనే రేంజ్‌లో రాసుకున్నాడట దర్శకుడు. ఈ క్లైమాక్స్ ప్రేక్షకులను మళ్లీ మళ్లీ థియేటర్స్‌కు రప్పిస్తుందని ఫిలిమ్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. ప్రజెంట్ ఈ వార్త నెట్టింట వైరల్ కావడంతో.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కూడా నెవర్ బిఫోర్‌గానే ఉంది.. ఇప్పుడు ‘RC16’ క్లైమాక్స్ ఎలా ఉండబోతుందో అని క్యూరియాసిటీని వ్యక్తం చేస్తున్నారు ప్రేక్షకులు. కాగా... బుచ్చిబాబు డైరెక్షన్‌లో వచ్చిన ‘ఉప్పెన’ ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం క్లైమాక్స్‌తోనే ఆ రేంజ్ హిట్ సొంతం చేసుకుంది అనడంలో కూడా అతిశయోక్తి లేదు.
Night Shoot!
— Rathnavelu ISC (@RathnaveluDop) February 7, 2025
Flood lights !
Power Cricket !
Weird Angles ! #RC16@AlwaysRamCharan bro🔥🔥 🔥 @BuchiBabuSana @arrahman @RathnaveluDop @vriddhicinemas @MythriOfficial @SukumarWritings pic.twitter.com/E92Ez9ec9a






