- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వెరైటీ డ్రెస్‌తో హీట్ పుట్టిస్తున్న రామ్ చరణ్ హీరోయిన్.. ఉర్ఫీ అక్కలా ఉన్నావంటూ నెటిజన్ల కామెంట్స్ (పోస్ట్)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ(Kiara Advani) హిందీలో పలు చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ(Kiara Advani) హిందీలో పలు చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఇక తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ‘భరత్ అనే నేను’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత రామ్ చరణ్(Ram Charan)తో ‘వినయ విధేయ రామ’ మూవీలో నటించి తన అందం, అభినయం నటనతో మైమరపించింది. ఇక ఇటీవల మరోసారి రామ్ చరణ్ సరసన ‘గేమ్ చేంజర్’లో నటించింది. సంక్రాంతి కానుకగా థియేటర్స్‌లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. బాక్సాఫీసు వద్ద హిట్ అందుకోలేకపోయింది.
అంతేకాకుండా విడుదలైన రోజే ‘గేమ్ చేంజర్’(Game Changer) హెచ్డీ ప్రింట్ సోషల్ మీడియాలో లీక్ కావడంతో సినిమాకు కోలుకోలేకుండా అయింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై ఊహించిన విధంగా డిజాస్టర్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే.. కియారా వరుస చిత్రాలతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ పలు ఫొటో షూట్‌తో అభిమానులకు దగ్గరగా ఉంటుంది. తాజాగా, ఈ అమ్మడు వెరైటీ డ్రెస్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. బొమ్మలకు తగించేలా ఉన్న వైట్ కలర్ డ్రెస్‌ను శరీరానికి అతికించుకుంది. ఇందులో నడుము, థైయ్స్ చూపిస్తూ హీటెక్కించిన. ప్రస్తుతం కియారా ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక వాటిని చూసిన వారు కొందరు ఊర్ఫీ జావెద్ అక్కలా ఉన్నావని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం గార్జియస్ అని అంటున్నారు.
POST






