- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ram Charan: రంగస్థలం, RRR కంటే ఈ సినిమా చాలా ఎగ్జైటింగ్‌గా ఉంటుంది.. పెద్దిపై హైప్ పెంచేసిన రామ్ చరణ్ కామెంట్స్
రామ్ చరణ్ (Ram Charan), బుచ్చిబాబు సనా (Buchibabu Sana) కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది’ (Peddi).

దిశ, సినిమా: రామ్ చరణ్ (Ram Charan), బుచ్చిబాబు సనా (Buchibabu Sana) కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది’ (Peddi). భారీ అంచనాల మధ్య ‘పెద్ది’ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. దీంతో ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌లో కూడా చిత్రీకరణ జరుపుకుంటున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇటీవల ‘పెద్ది’ నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా.. మూవీపై ఫ్యాన్స్‌తో పాటు సిని ప్రియుల్లో కూడా ఎక్స్‌పెక్టేషన్స్ భారీగా పెరిగాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న రామ్ చరణ్ పెద్ది సినిమాపై మరింత హైప్ పెంచేశాడు. ‘మీ అందరికి పెద్ది గ్లింప్స్ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నేను చేసిన సినిమాల్లో ఇదొక బెస్ట్ స్క్రిప్ట్. బహుశా.. రంగస్థలం (Rangasthalam), RRR కంటే ఈ సినిమా చాలా ఎగ్జైటింగ్‌గా ఉంటుందని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఈ మాట నేను మామూలుగా అన్ని సినిమాలకు చెప్పను. ఇది మీరు కచ్చితంగా రాసిపెట్టుకోండి’ అంటూ చెప్పుకొచ్చాడు చరణ్. దీంతో ఫ్యాన్స్‌లో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. కాగా.. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తుంది.






