- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Upasana: ‘కొన్నిసార్లు వ్యాక్స్ వెర్షన్ మంచి భర్తను చేస్తుంది’.. విగ్రహావిష్కరణ వేళ ఉపాసన ఇంట్రెస్టింగ్ పోస్ట్
మెగాస్టార్ చిరంజీవి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. చిరు వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు సంపాదించుకుంటున్నారు. ఇప్పటికే అనేక సినిమాల్లో నటించి మంచి పేరు దక్కించుకున్నాడు. ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు తాజాగా అరుదైన గౌరవం లభించింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఓవర్ నైట్ ఫేమ్ దక్కించుకున్న ఈ కథానాయకుడి మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరించారు. ఇది భారతీయసినీ ఇండస్ట్రీకే ఒక అరుదైన గౌరవం అని చెప్పుకోవచ్చు. ఈ విగ్రహం ఆవిష్కరణ కోసం రామ చరణ్ ఫ్యామిలీ, పలువురు సన్నిహితులు హాజరై.. సందడి చేశారు. మేడమ్ టుస్సాడ్స్‌లో ఈ విగ్రహ మే 19 వరకు ఉంటుందని సమాచారం.
అనంతర సింగపూర్‌కు తరలించి.. అక్కడ ప్రదర్శించనున్నారని టాక్. అయితే ఈ సంతోషాన్ని చరణ్ సతీమణి సోషల్ మీడియాలో పంచుకుంది. ‘‘టీం రైమ్ లేదా టీం రామ్.. అండ్ నా క్లిన్ కారా చాలా ముద్దుగా ఉంది. కొన్నిసార్లు వ్యాక్స్ వెర్షన్ మంచి భర్తను చేస్తుంది. ప్రతి చిత్రంలో వినడం, అద్భుతంగా కనిపించడం మాత్రమే’’ అంటూ లవ్ సింబల్స్, లాఫింగ్ ఎమోజిలను జోడించి ఉపాసన రాసుకొచ్చంది.






