Ram Charan: రామ్ చరణ్, త్రివిక్రమ్ కాంబో ఫిక్స్.. వైరల్‌గా పోస్ట్

by Chukka Sudharani |

గోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ చిత్రంతో బిజీగా ఉన్నాడు.

Ram Charan: రామ్ చరణ్, త్రివిక్రమ్ కాంబో ఫిక్స్.. వైరల్‌గా పోస్ట్
X

దిశ, సినిమా: గోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే.. రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు ఇప్పుడు మరో గుడ్ న్యూస్ వచ్చింది. RC17కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. రామ్ చరణ్ తన RC17 కోసం డైరెక్టర్ త్రివిక్రమ్‌తో చేతులు కలిపాడు. ప్రస్తుతం ‘పెద్ధి’ షూటింగ్ జరుగుతుండగా ఇది నవంబర్ చివరి నాటికి ముగుస్తుందని టాక్. ఆ తర్వాత నూతన సంవత్సరం నుంచి త్రివిక్రమ్ - రామ్ చరణ్ ప్రాజెక్ట్ ప్రారంభమవుతుందని నెట్టింట ఓ పోస్టర్ వైరల్ అవుతోంది. దీంతో RC ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Next Story