- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
"చికిరి చికిరి"లో హైలైట్ అయినా ఆ ఐడియా రామ్ చరణ్‌దే.. జానీ మాస్టర్
తాజా ఇంటర్వ్యూలో జానీ మాస్టర్ మాట్లాడుతూ.. 'చికిరి చికిరి' పాటలో రామ్ చరణ్ గారు నిలబడి వేసే స్టెప్ నేను కంపోజ్ చేయలేదు. అది ఆయనే స్వయంగా కొరియోగ్రఫీ చేసి డాన్స్ చేశారు. ఈ పాటలో కూర్చొని వేసే స్టెప్ మాత్రం నేను కంపోజ్ చేశాను అని జానీ మాస్టర్ తెలియజేశారు.

దిశ, వెబ్ డెస్క్ : డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇప్పటికే ఇండియావ్యాప్తంగా చాలా సినిమాలకు పనిచేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న పెద్ది సినిమాలోని చికిరి చికిరి పాటకి జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్గా వ్యవహరించాడు. ఈ సాంగ్కి సంబంధించిన వీడియోను మేకర్స్ విడుదల చేశారు. అది బాగుండడం, అందులో చరణ్ వేసిన స్టెప్స్ కూడా బాగుండడంతో ఒక్కసారిగా జానీ మాస్టర్ పేరు ఇండియా వ్యాప్తంగా మారుమోగుతోంది.
ఈ సాంగ్ వల్ల పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచిన జానీ మాస్టర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో చికిరి చికిరి సాంగ్ గురించి అనేక విషయాలను తెలియజేశాడు. జానీ మాస్టర్ మాట్లాడుతూ... ఆ సాంగ్లో రామ్ చరణ్ గారు నిల్చొని ఒక స్టెప్పు వేస్తారు. అది చాలా పాపులర్ అయింది. అనేకమంది దానికి రీల్స్ చేస్తున్నారు. చాలా బాగా కంపోజ్ చేశారని అనేకమంది నన్ను ప్రశంసిస్తున్నారు. కానీ ఆ ప్రశంసలన్నీ దక్కాల్సింది నాకు కాదు, రామ్ చరణ్ గారికి. ఎందుకంటే ఆ సాంగ్లో రామ్ చరణ్ గారు నిల్చొని వేసే స్టెప్ ను నేను కంపోజ్ చేయలేదు.
ఆయనే స్వయంగా కంపోజ్ చేసి డాన్స్ చేశాడు. అందుకే ఆ పాటలోని ఆ స్టెప్ కి వచ్చే ప్రశంసలన్నీ రామ్ చరణ్ గారికి దక్కాలి అని జానీ మాస్టర్ అన్నారు. ఈ పాటలో కూర్చుని వేసే డ్యాన్స్ మూమెంట్ ఐడియా మాత్రం తనదే అని ఆయన పేర్కొన్నారు. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా బుచ్చిబాబు సనా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 31వ తేదీన విడుదల చేయనున్నారు.






