అల్లు అర్జున్ పోస్టుకు స్పందించిన రామ్ చరణ్

by Pulgam srinivas |

‘పెద్ది’ సినిమా విజయంపై అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించగా, రామ్ చరణ్ కూడా స్పందిస్తూ ఆయన విషెస్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు.

అల్లు అర్జున్ పోస్టుకు స్పందించిన రామ్ చరణ్
X

దిశ, రాబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా ‘పెద్ది’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించాడు. జగపతిబాబు, దివ్యేందు, శివరాజ్ కుమార్, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించారు. జూన్ 4న విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం మంచి ప్రేక్షకాదరణ పొందుతూ భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా విజయవంతంగా ముందుకు దూసుకెళ్తుండటంతో అల్లు అర్జున్ నిన్న సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందాన్ని, అలాగే హీరోగా నటించిన రామ్ చరణ్‌ను ప్రశంసిస్తూ ఓ ప్రత్యేక పోస్ట్ చేశాడు.

ఆ పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. తాజాగా ఆ పోస్ట్‌కు స్పందించిన రామ్ చరణ్ “నీ విషెస్ నాకు, మొత్తం ‘పెద్ది’ టీమ్‌కు ఎంతో ప్రత్యేకం” అంటూ తన ప్రేమాభిమానాలను వ్యక్తం చేశాడు. అలాగే, అల్లు అర్జున్ నటిస్తున్న ‘రాకా’ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నాడు. అల్లు అర్జున్ ‘పెద్ది’ చిత్రంపై ప్రశంసలు కురిపించడం, అనంతరం రామ్ చరణ్ కూడా స్పందించడం ఇండస్ట్రీలో సానుకూల వాతావరణానికి నిదర్శనమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్టార్ హీరోలు ఇలా ఒకరి సినిమాలను మరొకరు ప్రోత్సహించుకోవడం ఇండస్ట్రీకి కూడా ఎంతో ఉపయోగకరమని వారు చెబుతున్నారు.

Next Story