రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. పెద్ది సినిమా ట్రైలర్ డేట్ ఇదే!

by velandi.Saikiran |

రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. పెద్ది సినిమా ట్రైలర్ డేట్ లాక్ అయింది.

రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. పెద్ది సినిమా ట్రైలర్  డేట్ ఇదే!
X

దిశ‌, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ మెరువనున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు ఫినిష్ అయింది. ప్రస్తుతం ఐటెమ్ సాంగ్ షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

ఈ నెల 17 లేదా 18 తేదీన పెద్ది సినిమా ట్రైలర్ రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం నిర్ణయం తీసుకుందట. ఈ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత దేశ వ్యాప్తంగా సినిమాను ప్రమోట్ చేయాలని డిసైడ్ అయ్యారట. ఈ మేరకు కసరత్తులు మొదలు అయినట్లు తెలుస్తోంది. కాగా బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ పెద్ది సినిమా జూన్ 4వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మేరకు ఇప్పటి నుంచే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Next Story