- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షర్ట్ లేకుండా రామ్ చరణ్..లుక్స్ వైరల్
రామ్ చరణ్ కు సంబంధించిన కొత్త లుక్స్ వైరల్ గా మారాయి. ఇందులో షర్ట్ లేకుండానే రాంచరణ్ మెరిసాడు.

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది మార్చి 27వ తేదీన రిలీజ్ కాబోతుందట.
ఈ మేరకు ఇప్పటికే సినిమా బృందం అనౌన్స్ చేసింది. ఈ మూవీలో రామ్ చరణ్ హీరోగా చేస్తుండగా బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా మెరువనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అన్ని జనాలను ఆకట్టుకున్నాయి. సినిమా కూడా బంపర్ హిట్ అవుతుందని అందరు అంచనా వేస్తున్నారు. చాలా రోజుల నుంచి హిట్ కోసం రాంచరణ్ కూడా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.
షర్ట్ లేకుండా రామ్ చరణ్ లుక్స్
బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న పెద్ది సినిమా కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చాలా కష్టపడుతున్నాడు. నిద్ర లేకుండా కూడా వర్క్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో కొన్ని పార్ట్స్ మళ్ళీ రీ- షూట్ కూడా చేయబోతున్నారట. అందుకే రామ్ చరణ్ చాలా ఫోకస్ గా ఉన్నారని నడుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో రామ్ చరణ్ కు సంబంధించిన కొత్త లుక్స్ వైరల్ గా మారాయి. ఇందులో షర్ట్ లేకుండానే రాంచరణ్ మెరిసాడు. జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ బిజీగా ఉన్న రామ్ చరణ్ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. కాగా పెద్ది సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సంగతి తెలిసిందే.






