- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామ్ చరణ్: ఆర్ఆర్ఆర్ గ్లోబల్ సక్సెస్‌లో నెట్‌ఫ్లిక్స్ పాత్ర కీలకం
ప్రస్తుత కాలంలో సినిమాల స్థాయిని మరింత విస్తరించడంలో ఓటీటీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రామ్ చరణ్ పేర్కొన్నారు.

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ప్రభావంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ఓటీటీలు సినిమాల పరిధిని మరింత విస్తరించాయని అన్నారు. గతంలో ఒక ప్రాంతంలో విడుదలైన సినిమా ఆ ప్రాంత ప్రేక్షకులకే పరిమితమయ్యేదని, కానీ ఇప్పుడు ఓటీటీల వల్ల చిన్న ప్రాంతాల్లో రూపొందిన మంచి సినిమాలు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాయని పేర్కొన్నారు.
అలాగే తాను నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడంలో నెట్‌ఫ్లిక్స్ కీలక పాత్ర పోషించిందని రామ్ చరణ్ తెలిపారు. ఆ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ లభించడంతో పాటు ఆస్కార్ అవార్డు సాధించే ప్రయాణంలో కూడా ఓటీటీ వేదికలు ఎంతో సహకరించాయని చెప్పారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఇటీవల 'పెద్ది' చిత్రంతో ప్రేక్షకులను అలరించిన రామ్ చరణ్, త్వరలో సుకుమార్ దర్శకత్వంలో మరో భారీ ప్రాజెక్ట్ చేయనుండగా, ఆ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.






