- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామ్ చరణ్ పై దారుణంగా ట్రోల్స్.. కారణం ఇదే !
పెద్ది ట్రైలర్ ఈవెంట్ లో డ్యాన్స్ చేస్తుండగా రామ్ చరణ్ కాస్త ఇబ్బంది పడ్డాడు.

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయిన రామ్ చరణ్, ప్రస్తుతం పెద్ది సినిమాతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తికాగా... మరో రెండు వారాల్లో రిలీజ్ కూడా కానుంది. ఇలాంటి క్రమంలో ప్రమోషన్స్ పై రామ్ చరణ్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. నిన్న ముంబై వేదికగా పెద్ది మూవీ ట్రైలర్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ చేసిన డ్యాన్స్ పై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అభిమానుల కోరిక మేరకు ఈ ఈవెంట్ లో చికిరి చికిరి పాటకు హుక్ స్టెప్పులు వేశాడు రామ్ చరణ్.
అయితే ఈ స్టెప్పులు వేసేటప్పుడు ముందు కాస్త తడబడ్డాడు. ఆ తర్వాత ఇరగదీశాడు. ఈ క్రమంలోనే ట్రోల్స్ మొదలు పెట్టారు. హుక్ స్టెప్పులు వేసేందుకు మొదట ఇబ్బంది పడ్డ, రామ్ చరణ్ వీడియోను వైరల్ చేసి ఆడుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా పెద్ది సినిమాలో రామ్ చరణ్ హీరోగా చేస్తుండగా.. హీరోయిన్ గా బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ మెరువనున్నారు. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అందరినీ ఆకట్టుకోగా.. నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా హైప్ ను అమాంతం పెంచేసింది.






