- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈసారి ఫ్యాన్స్‌కు బిర్యానీ ఫిక్సా?... ఫుల్ కాన్ఫిడెంట్‌గా రామ్ చరణ్ డైరెక్టర్ (వీడియో)
ఆర్ఆర్ఆర్ సినిమా(RRR Movie) తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)కు సరైన హిట్ పడలేదు.

దిశ, వెబ్‌డెస్క్: ఆర్ఆర్ఆర్ సినిమా(RRR Movie) తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)కు సరైన హిట్ పడలేదు. తండ్రి మెగాస్టా్ర్ చిరంజీవితో కలిసి నటించిన ఆచార్య మూవీ డిజాస్టర్‌గా మిగిలింది. తమిళ అగ్ర దర్శకుడు శంకర్‌తో చేసిన గేమ్ ఛేంజర్ సినిమా(Game Changer Movie) కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. దీంతో ఒక్క చరణ్ ఫ్యాన్సే కాకుండా.. మొత్తం మెగా ఫ్యాన్సే నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్‌తో #RC16 అనే వర్కింగ్ టైటిల్‌తో సినిమా చేస్తున్న ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు(Buchi Babu) ఫ్యాన్స్‌కు బూస్ట్ ఇచ్చే వ్యాఖ్యలు చేశారు. తాజాగా హైదరాబాద్‌లో నటుడు బ్రహ్మాజీ ప్రధానపాత్రలో తెరకెక్కిన బాపు సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో బుచ్చిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
‘నా తండ్రికి సినిమాలు అంటే అస్సలు ఇష్టం లేదు. నేను డైరెక్టర్ అవుతానని చెప్పినా తిట్టేవాడు. అయినా మా నాన్న మాట లెక్కచేయకుండా హైదరాబాద్‌కు వచ్చాను. అనుకున్నట్లే డైరెక్టర్ అయ్యాను. ఉప్పెన సినిమాను కుటుంబం మొత్తం థియేటర్‌లో చూశారు. కానీ మా నాన్న ఒక్కడే థియేటర్ బయట నిల్చొని సినిమా చూసిన వాళ్లందనీ ఎలా ఉంది? ఎలా ఉంది? అని అడిగారు. పబ్లిక్ టాక్ చూసి హ్యాపీగా ఫీలయ్యారు. ఇప్పుడు ఈ స్టేజీ మీద నుంచి మా నాన్నకు మరో మాట ఇస్తున్నాను. రామ్ చరణ్‌తో తీసే సినిమా ఎలా ఉంది అని ఎవరినీ అడగాల్సిన అవసరం లేదు. రిలీజ్ అయ్యాక సినిమానే మాట్లాడుతుంది’ అని బుచ్చిబాబు అన్నారు. దీంతో చరణ్ ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీగా ఉన్నారు. ‘ఆ కాన్ఫిడెంట్ ఏంటి అన్నా.. నీ మీద మాకు నమ్మకం ఉంది’ అంటూ చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
కాగా #RC16లో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ హీరో శివరాజ్ కుమార్(Shiva Rajkumar), జగపతి బాబు, మరో బాలీవుడ్ నటుడు మున్నాభాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సుకుమార్ - రామ్ చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన రంగస్థలం సినిమాకు బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే.






