- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ram Charan: ముస్లింల దావత్ కు మెగా హీరో.. వీడియో వైరల్

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవి (Chiraneevi ) కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు రామ్ చరణ్. వరుసగా సినిమాలతో దూసుకు వెళ్తున్న.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. రంజాన్ ఈద్ వేడుకల్లో ( Ramadan Eid celebration) పాల్గొన్నారు. హైదరాబాద్ లోని తన ముస్లిం స్నేహితుల ఇంటికి వెళ్లి... రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. క్యాజువల్ డ్రెస్ వేసుకున్న చరణ్... సింపుల్ లుక్ లో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ కు మంచి వెల్కమ్ లభించింది. రామ్ చరణ్ ముస్లిం స్నేహితుని కుటుంబ సభ్యులు కూడా... అతని ఎంతో ఆప్యాయంగా.. పలకరించారు.
అనంతరం ముస్లిం వంటకాలను ఆరగించారు రామ్ చరణ్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన మెగా అభిమానులు సంబరపడిపోతున్నారు. ఇది ఇలా ఉండగా.. ఇటీవల శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేసిన రామ్ చరణ్... ఇప్పుడు పెద్ది సినిమా ( Peddi Movie) చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా వస్తున్నట్లు తెలుస్తోంది. బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.... హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీత స్వరాలు అందిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.






