Rakul: గోల్డెన్ అండ్ బ్లాక్ కాంబినేషన్‌లో హాట్ లుక్‌తో ఆకట్టుకున్న స్టార్ బ్యూటీ

by Pulgam srinivas |

బ్లాక్ అండ్ గోల్డెన్ కలర్ కాంబినేషన్ డ్రెస్‌లో రెచ్చిపోయిన రకుల్ ప్రీత్ సింగ్.

Rakul: గోల్డెన్ అండ్ బ్లాక్ కాంబినేషన్‌లో హాట్ లుక్‌తో ఆకట్టుకున్న స్టార్ బ్యూటీ
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈమె తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకొని ఎంతో గొప్ప గుర్తింపును సంపాదించుకుంది. అయితే కెరీర్ ప్రారంభంలో మాత్రం ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. రకుల్ తెలుగు సినీ పరిశ్రమలో మొదటగా ప్రభాస్ హీరోగా రూపొందిన మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది.




మొదట ఈమెను కాజల్ అగర్వాల్ చేసిన పాత్ర కోసం తీసుకున్నారు. ఈమెపై కొన్ని రోజుల పాటు షూటింగ్ కూడా నిర్వహించారు. కానీ తర్వాత ఆ పాత్రకు సెట్ కాదనే ఉద్దేశంతో చిత్ర బృందం ఈ నటిని సినిమా నుంచి తప్పించింది. ఆ తర్వాత ఆ పాత్రలో కాజల్ అగర్వాల్‌ను తీసుకున్నారు. ఇలా మొదటి సినిమా విషయంలోనే ఈ హీరోయిన్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది.




అదే విధంగా తర్వాత కూడా పలు చిత్రాల్లో అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇలా తెలుగులో తొలి అవకాశాల విషయంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న ఈమె, చివరకు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వరుస విజయాలతో తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో తిరుగులేని స్థాయికి చేరుకుంది.



తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి దశలో కెరీర్ కొనసాగిస్తున్న సమయంలోనే ఈమె తమిళ్, హిందీ చిత్రాలపై కూడా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆ రెండు భాషల చిత్రాల్లోనే నటిస్తూ వస్తోంది. ఇక సినిమాల విషయాన్ని కాసేపు పక్కన పెడితే, సోషల్ మీడియాలో మాత్రం ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్‌గా ఉంటూ తన హాట్ ఫోటోలతో కుర్రకారులో హార్ట్‌బీట్ పెంచుతోంది.



తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో గోల్డెన్ కలర్ డిజైన్ ఉన్న స్లీవ్‌లెస్ టాప్‌, బ్లాక్ కలర్ థై స్లిట్ డ్రెస్ ధరించి సూపర్ హాట్ లుక్‌లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. చెవులకు లాంగ్ ఇయర్‌రింగ్స్ ధరించి, తన కురులను హైలెట్ చేస్తూ ఇచ్చిన ఈ స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Photos Courtesy: Instagram

Next Story