- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అబార్షన్ గురించి ఓపెన్ అయిన రకుల్.. మూడు, నాలుగు మిస్‌క్యారేజెస్ అంటూ సంచలన వ్యాఖ్యలు.. ఆ సమయంలోనే.. వీడియో వైరల్
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. బాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్‌ను పెళ్లి చేసుకుని సెటిల్ అపోయింది. మ్యారేజ్ తర్వాత సెలెక్టెడ్ మూవీస్ చేస్తోంది. హెల్త్ అండ్ ఫిట్‌నెస్ మీద కాన్సంట్రేట్ చేసే ఈ బ్యూటీ..

దిశ, ఫీచర్స్ : హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. బాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్‌ను పెళ్లి చేసుకుని సెటిల్ అపోయింది. మ్యారేజ్ తర్వాత సెలెక్టెడ్ మూవీస్ చేస్తోంది. హెల్త్ అండ్ ఫిట్‌నెస్ మీద కాన్సంట్రేట్ చేసే ఈ బ్యూటీ.. ఓ ఇంటర్వ్యూలో స్త్రీల శరీరం గురించి మాట్లాడింది. అబార్షన్స్ కారణంగా వాళ్లు ఎంత బాధపడుతున్నారో వివరించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. తను ఏం చెప్పిందో చూద్దాం. నెటిజన్ల రియాక్షనం ఎలా ఉందో తెలుసుకుందాం.
‘ అనుకోకుండా, అన్‌ప్లాన్డ్‌గా ప్రెగ్నెన్సీ వస్తే అబార్షన్ చేసుకో అని సింపుల్‌గా చెప్పేస్తారు. అంత ఈజీనా..? స్కిన్ లేయర్ పీల్ చేస్తేనే ఎంత పెయిన్ ఉంటుంది..? అలాంటిది ఒక జీవాన్ని సిస్టెమ్ నుంచి రిమూవ్ చేయమంటే.. ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ ట్రామా ఉండదా? దీని గురించి ఎవరు మాట్లాడరు ఎందుకని? నిజానికి సైన్స్ చెప్తుందేంటంటే.. ఒక స్త్రీ శరీరం రెండు మిస్‌క్యారేజెస్ మాత్రమే భరించగలదు. కానీ ఐదుగురిలో ఇద్దరు మహిళలు మూడు నుంచి ఐదు వరకు అబార్షన్ పొందుతున్నారు. ఈ పెయిన్ గురించి భర్తలు తెలుసుకోకూడదా? భార్యకు సపోర్ట్ చేయకూడదా?’ అని ప్రశ్నించింది. అబార్షన్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడేందుకు ముందుకు రావాలని కోరింది. కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఈ విషయంపై మాట్లాడటం ఫస్ట్ టైమ్ చూస్తున్నా.. గర్వంగా ఉంది’ అని చెప్తున్నారు. ఇంకొందరు తమ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటున్నారు. తనకు భర్త, అత్తమామ సపోర్ట్ లేదంటూ బాధపడుతున్నారు.






