- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ వ్యాఖ్యలు కరెక్ట్ కాదు.. భర్త కామెంట్స్‌పై ఘాటుగా స్పందించిన రకుల్ ప్రీత్ సింగ్
తమ వివాహ బంధంపై భర్త జాకీ భగ్నానీ చేసిన ‘సిట్యుయేషన్‌షిప్’ వ్యాఖ్యలు నెట్టింట సంచలనంగా మారడంతో.. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.

దిశ, సినిమా: తమ వివాహ బంధంపై భర్త జాకీ భగ్నానీ చేసిన ‘సిట్యుయేషన్‌షిప్’ వ్యాఖ్యలు నెట్టింట సంచలనంగా మారడంతో.. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ‘గంటసేపు సాగిన సంభాషణలోని ఒక్క వాక్యం ఆశ్చర్యంగా ప్రధాన వార్తగా ఎలా మారిపోతుందో చూసి ఈరోజు మేమంతా చాలా నవ్వుకున్నాం. తమాషాగా అనిపిస్తుంది.. కానీ ప్రతీసారి ఇది కరెక్టు కాదు. మా బంధంలోని స్నేహాన్ని, స్వేచ్ఛను ఉద్దేశించి ఆయన ఆ పదాన్ని వాడారే తప్ప, ప్రచారంలో ఉన్నట్లుగా మరొకటి కాదు. ఒక విషయాన్ని కేవలం క్లిక్‌బైట్‌గా మార్చేయడం కంటే.. కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ తాము సృష్టించే కథనాల పట్ల మరికొంత బాధ్యత వహించాల్సిన సమయం ఆసన్నమైందేమో’ అంటూ తెలిపింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాకీ భగ్నానీ.. తాము పెళ్లి చేసుకున్నప్పటికీ ఒక రకమైన ‘సిట్యుయేషన్‌షిప్’లో ఉన్నామని, ఒకరికొకరు ఎంతో పారదర్శకంగా, స్వేచ్ఛగా ఉంటామని పేర్కొన్నారు. తమ మధ్య ఉండే నిజాయతీని సిట్యుయేషన్‌షిప్ అని పిలవడంతో నెట్టింట నెగిటివ్‌గా స్పందించడంతో క్లారిటీ ఇస్తూ ఫైర్ అయింది ఈ బ్యూటీ.






