Rakul : స్టార్ట్ అయ్యాక ఫస్ట్ మూవీ నుండి తీసేశారు.. కెరీర్ బిగినింగ్‌లో ఎన్నో కష్టాలు.

by Pulgam srinivas |

Rakul : 'రకుల్'ని మొదట మిస్టర్ ఫర్ఫెక్ట్ చిత్రంలో కాజల్ స్థానంలో ఎంచుకుని కొన్ని రోజులు షూటింగ్ కూడా చేశారు, కానీ ఆ తర్వాత అందులో నుండి ఆమెను తొలగించారు.

Rakul : స్టార్ట్ అయ్యాక ఫస్ట్ మూవీ నుండి తీసేశారు.. కెరీర్ బిగినింగ్‌లో ఎన్నో కష్టాలు.
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా చాలా సంవత్సరాలు కెరీర్ను కొనసాగించిన వారిలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈమె ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి గొప్ప గుర్తింపును సంపాదించుకుంది. చాలా కాలం పాటు అద్భుతమైన రీతిలో కెరీర్ను కొనసాగించిన ఈ బ్యూటీకి తెలుగు చిత్రసీమలో ప్రయాణం మొదలుపెట్టిన కొత్తలో అనేక కష్టాలు ఎదురయ్యాయి. ఏకంగా ఈ బ్యూటీని ఒక సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ చేసి, కొన్ని రోజులు షూటింగ్ కూడా చేశాక మూవీ నుండి తొలగించారు.

అలా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న ఈమె ఆ తర్వాత మంచి విజయాలను అందుకొని అద్భుతమైన స్థాయికి చేరుకుంది. ఇంతకు రకుల్ హీరోయిన్గా సెలెక్ట్ అయ్యాక, కొన్ని రోజుల షూటింగ్ కూడా చేశాక ఏ సినిమా నుండి తొలగించబడింది అనుకుంటున్నారా? అది మరేదో కాదు, మిస్టర్ ఫర్ఫెక్ట్. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, కాజల్ అగర్వాల్, తాప్సి హీరోయిన్లుగా దశరథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమాలో మొదట కాజల్ అగర్వాల్ పాత్రకు రకుల్ ఎంపికైంది. ఆమెపై ఏకంగా కొన్ని రోజుల షూటింగ్ కూడా చేశారు.

కానీ ఆ తర్వాత ఆ సినిమాకు ఆమె సరిపోదనే ఉద్దేశంతో ఆమెను తొలగించి, అదే స్థానంలో కాజల్ అగర్వాల్ ను పెట్టుకున్నట్లు ఈ సినిమా నిర్మాత అయిన దిల్ రాజు ఒకానొక ఇంటర్వ్యూలో భాగంగా చెప్పారు. ఇక రకుల్ 'వెంకటాద్రి ఎక్స్ప్రెస్' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే విజయాన్ని, గుర్తింపును దక్కించుకుంది. ఆ తర్వాత తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సినిమాల్లో నటించి ఎన్నో విజయాలను అందుకొని చాలా ఏళ్ల పాటు మంచి దశలో కెరీర్ను ముందుకు సాగించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు సినిమాల్లో నటించడం కంటే కూడా తమిళ, హిందీ చిత్రాలు చేయడంపై ఆసక్తి చూపిస్తుంది.

Next Story