మళ్లీ థియేటర్లలోకి రానున్న 'రక్త చరిత్ర'.. విడుదల తేదీ ఖరారు

by Pulgam srinivas |

‘రక్త చరిత్ర’ సినిమాను జూలై 17న రీ-రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

మళ్లీ థియేటర్లలోకి రానున్న రక్త చరిత్ర.. విడుదల తేదీ ఖరారు
X

దిశ, వెబ్ డెస్క్: రామ్ గోపాల్ వర్మ కెరీర్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టిన చిత్రాల్లో ‘రక్త చరిత్ర’ ఒకటి. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు పరిటాల రవీంద్ర మరియు మద్దెలచెరువు సూరి జీవిత కథల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో పరిటాల రవి పాత్రలో వివేక్ ఒబెరాయ్, మద్దెలచెరువు సూరి పాత్రలో సూర్య నటించారు. మొదటి భాగంలో అతిథి పాత్రలో కనిపించిన సూర్య, రెండో భాగంలో ప్రధాన పాత్రలో మెప్పించాడు. అలాగే ఇతర కీలక పాత్రల్లో సుదీప్, శత్రుఘ్న సిన్హా, రాధికా ఆప్టే, కోట శ్రీనివాసరావు నటించారు. ఈ చిత్రం 2010లో విడుదలైంది. ఇక తాజాగా ‘రక్త చరిత్ర’ సినిమాను రీ-రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని జూలై 17న భారీ స్థాయిలో థియేటర్లలో మళ్లీ విడుదల చేయనున్నారు. ఒకప్పుడు ప్రేక్షకులను బలంగా ఆకట్టుకున్న ఈ సినిమా, రీ-రిలీజ్‌లో ఎలాంటి స్పందనను అందుకుంటుందో చూడాలి.




Next Story