హార్ట్ బీట్ ఆఫ్ శబార.. కథల ఎంపికలో రక్షిత్ శెట్టి నెక్స్ట్ లెవల్ అంతే..

by Sujitha Rachapalli |

దీక్షిత్ శెట్టి, క్రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో ప్రేమ్ చంద్ కిలారు తెరకెక్కించిన చిత్రం ‘శబార’. విశ్రమ్ ఫిల్మ్ ఫ్రాటర్నిటీ బ్యానర్ మీద హర్షిత చదలవాడ, దుర్గా చుంచు, రమాదేవి కిలారు నిర్మించిన ఈ మూవీకి సంబంధించిన ప్రపంచాన్ని ‘హార్ట్ బీట్ ఆఫ్ శబార’ ద్వారా పరిచయం చేశారు.

హార్ట్ బీట్ ఆఫ్ శబార.. కథల ఎంపికలో రక్షిత్ శెట్టి నెక్స్ట్ లెవల్ అంతే..
X

దిశ, సినిమా : దీక్షిత్ శెట్టి, క్రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో ప్రేమ్ చంద్ కిలారు తెరకెక్కించిన చిత్రం ‘శబార’. విశ్రమ్ ఫిల్మ్ ఫ్రాటర్నిటీ బ్యానర్ మీద హర్షిత చదలవాడ, దుర్గా చుంచు, రమాదేవి కిలారు నిర్మించిన ఈ మూవీకి సంబంధించిన ప్రపంచాన్ని ‘హార్ట్ బీట్ ఆఫ్ శబార’ ద్వారా పరిచయం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన హీరో దీక్షిత్ శెట్టి... ‘‘శబార’ కోసం వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నా ‘గర్ల్ ఫ్రెండ్’ సినిమాకి మీడియా మంచి సపోర్ట్ ఇచ్చింది ‘శబార’కి కూడా అలానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అందరికీ ‘హార్ట్ బీట్ ఆఫ్ శబార’ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. శబార అంటే ప్రపంచం.. ప్రేమ్ చంద్ క్రియేట్ చేసిన ప్రపంచమిది. అడవిలోనే మొత్తం కథ జరుగుతుంది. ఈ మూవీకి ఖచ్చితంగా సక్సెస్ మీట్ జరుగుతుంది. నేను ఇంత వరకు ఎనిమిది సినిమాలు చేశాను. మొదటి సారిగా ఓ మనిషి మీద నమ్మకం పెట్టుకుని ప్రేమ్ చంద్ కోసం ఈ మూవీని చేశాను. రెండేళ్లుగా మాతో ప్రయాణం చేసిన టీంకు థాంక్స్. మిథున్ తన మ్యూజిక్‌తో మాయ చేశారు. ‘హార్ట్ బీట్ ఆఫ్ శబార’ నచ్చితే షేర్ చేసి, అందరికీ చేరేలా సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

Next Story