'రాకా' నెక్స్ట్ షెడ్యూల్ అప్డేట్

by Pulgam srinivas |

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీకి సంబంధించిన తదుపరి షెడ్యూల్ ఈ నెల చివర్లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

రాకా నెక్స్ట్ షెడ్యూల్ అప్డేట్
X

దిశ, వెబ్ డెస్క్: అల్లు అర్జున్ ప్రస్తుతం ‘రాకా’ అనే భారీ బడ్జెట్ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాను వచ్చే ఏడాది డిసెంబర్‌లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీకి సంబంధించిన తదుపరి షెడ్యూల్ ఈ నెల చివర్లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ కాస్త ఎక్కువ రోజుల పాటు కొనసాగనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

అలాగే ఈ షెడ్యూల్‌లో అల్లు అర్జున్‌తో పాటు హీరోయిన్‌గా నటిస్తున్న దీపికా పదుకొణె కూడా జాయిన్ కానున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్‌లో అత్యంత భారీ గ్రాఫిక్స్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా గ్రాఫిక్స్ పనులకు చాలా సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం. అందుకే షూటింగ్‌ను వీలైనంత వేగంగా పూర్తి చేయాలనే ఆలోచనలో దర్శకుడు అట్లీ ఉన్నట్లు టాక్. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Next Story