- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హార్ట్ టచింగ్ లవ్ స్టోరీగా ‘రాజు వెడ్స్ రాంబాయి’..
అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. 15 ఏళ్ల క్రితం జరిగిన ఓ నిజసంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్స్‌లోకి వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని విజయాన్ని దక్కించుకుంది. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అంటూ ప్రేక్షకులు, క్రిటిక్స్ ఈ సినిమాకు ప్రశంసలు అందిస్తున్నారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది. తొలి రోజు ఏపీ, తెలంగాణలో ఈ సినిమాకు 1.47 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు దక్కినట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. దీంతో డే 1 నుంచే ఈ సినిమా మంచి వసూళ్లను దక్కించుకుంటుందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు మూవీ టీమ్. కాగా.. ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్‌టేల్స్ బ్యానర్స్‌పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్‌పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొచ్చారు. ఇందులో అఖిల్ రాజ్, తేజస్వినీ రావ్, శివాజి రాజా, చైతు జొన్నలగడ్డ, అనిత చౌదరి, కవిత శ్రీరంగం తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
- Tags
- Raju Weds Rambai






