ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్న రజినీకాంత్??

by Sujitha Rachapalli |

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి ఒక బ్రాండ్. కేవలం భారతదేశంలోనే కాదు విదేశాల్లోనూ ఆయనకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమా వచ్చిందంటే ఓ

ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్న రజినీకాంత్??
X

దిశ, వెబ్ డెస్క్ : సూపర్ స్టార్ రజినీకాంత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి ఒక బ్రాండ్. కేవలం భారతదేశంలోనే కాదు విదేశాల్లోనూ ఆయనకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమా వచ్చిందంటే ఓ మానియా స్టార్ట్ అయిపోతుంది. మూవీ రిలీజ్ డే.. కాలేజీలు, ఆఫీసులకు హాలీడేస్ డిమాండ్ చేస్తుంటారు. అలాంటి స్టార్ హీరో ఇండస్ట్రీకి ఇక గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఎస్.. రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో వచ్చే సినిమా ఆయన చివరి సినిమా కానుందని ఇండస్ట్రీ టాక్.

నెల్సన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ 2027లో స్టార్ట్ కాబోతుంది. స్క్రిప్ట్ రైటింగ్‌ కోసం నెల్సన్ ఏడాది తీసుకోనుండగా.. ప్రాజెక్ట్ పూర్తయ్యేందుకు మరో సంవత్సరం పట్టనుంది. మొత్తానికి ఇదే రజినీ ఫైనల్ ఫిల్మ్ అని తెలుస్తుండగా.. అభిమానులు బాధపడుతున్నారు. కాగా రజినీకాంత్ ఆధ్యాత్మిక బాటలో వెల్లనున్నట్లు తెలుస్తోంది.

Next Story