పవన్ కళ్యాణ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రాజేంద్ర ప్రసాద్.. నా అనుమానం ఇదేనంటూ.. అసలు విషయం బయటపెట్టిన నటుడు

by Sujitha Rachapalli |

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీపై అలకబూనాడు. ఏడాది అయిపోయినా సరే మర్యాదపూర్వకంగా సీఎం చంద్రబాబు నాయుడును కలవలేదని నోట్ రిలీజ్ చేశాడు. తామేమో సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయాలని చూస్తుంటే

పవన్ కళ్యాణ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రాజేంద్ర ప్రసాద్.. నా అనుమానం ఇదేనంటూ.. అసలు విషయం బయటపెట్టిన నటుడు
X

దిశ, ఫీచర్స్ : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీపై అలకబూనాడు. ఏడాది అయిపోయినా సరే మర్యాదపూర్వకంగా సీఎం చంద్రబాబు నాయుడును కలవలేదని నోట్ రిలీజ్ చేశాడు. తామేమో సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయాలని చూస్తుంటే.. కనీస గౌరవం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. టికెట్ రేట్ల గురించి మాత్రమే కలుస్తరని రాసుకొచ్చాడు. అయితే ఈ విషయంలో చాలా మంది చాలా రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు పవన్‌కు సపోర్ట్ చేస్తుంటే ఇంకొందరు మాత్రం ఆయన అధికారంలోకి రాకముందు ఇచ్చిన స్పీచ్‌ను వైరల్ చేస్తున్నారు. అసలు సీఎం ఎవ్వరు? ఎందుకు కలవాలి? అని ప్రశ్నించిన వీడియోను చూపిస్తూ దీని గురించి ఏమంటారని అడుగుతున్నారు.

ఇక ఈ విషయంపై సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘సినిమా ఇండస్ట్రీ అంటే కళాకారులు అని.. నా అనుమానం ఏంటంటే అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే సీఎంను ఎందుకు కలవాలి? అసలు ఆ అవసరం ఏంటి?’ అని ప్రశ్నించారు. అది అలా అడగు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చావని కొందరు అంటుంటే... ఇది ఓల్డ్ వీడియో అని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. గతంలో పవన్ స్టేట్మెంట్స్.. ఇప్పటి స్టాండ్ గురించి కంపెయిర్ చేస్తున్నారు.

Next Story