- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెలబ్రిటీల బూతులు.. మానసిక పరిస్థితి కారణమా?? మీ ఒపీనియన్ కూడా ఇదేనా?? అసలు రాజేంద్ర ప్రసాద్‌కు ఏమైంది?? పూర్తి వివరాలు..
వయసు మీద పడ్డాక పెద్దలు పిల్లల్లా ప్రవర్తిస్తారు. ఇది ప్రకృతి. సహజమైన చర్య. నోరు అదుపు తప్పుతుంది. ప్రతిదీ పెడార్థాలు తీస్తుంటారు. మాట్లాడిందే మాట్లాడుతుంటారు. చెప్పిందే చెప్తుంటారు.

దిశ, ఫీచర్స్ : వయసు మీద పడ్డాక పెద్దలు పిల్లల్లా ప్రవర్తిస్తారు. ఇది ప్రకృతి. సహజమైన చర్య. నోరు అదుపు తప్పుతుంది. ప్రతిదీ పెడార్థాలు తీస్తుంటారు. మాట్లాడిందే మాట్లాడుతుంటారు. చెప్పిందే చెప్తుంటారు. చిన్న పిల్లల్లా విసిగిస్తారు. ఇదంతా వార్ధక్యం వల్లనో, ఆరోగ్యం కోసం తీసుకుంటున్న మందుల వల్లనో అయ్యుండొచ్చు అంటున్నారు నిపుణులు. నటకిరీటిగా ఎదిగిన కళాకారుడు రాజేంద్ర ప్రసాద్ తాజాగా సహ నటుడు అలీ గురించి బూతులు మాట్లాడంతో ఈ విషయంపై పెద్ద చర్చ జరుగుతోంది.
అయితే ఇలా స్టేజీపైన నియంత్రణ లేకుండా బూతులు మాట్లాడిన నటుడు ఆయన ఒక్కడే కాదు. ఇంతకు ముందు కూడా ఇది జరిగింది. సీనియర్ నటులు ఇలాంటి మాటలు మాట్లాడి వార్తల్లో నిలిచారు. వివాదంలో చిక్కుకుని ఇన్నాళ్లుగా కష్టపడి సంపాదించుకున్న పేరును పోగొట్టుకున్నారు. అయితే వారి మాటలు ముమ్మాటికీ తప్పే. కానీ అసలు వీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారనే దానిపై కొందరు నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. వయసు మీద పడ్డాక నోరు పారేసుకోవడం కేవలం ఇండస్ట్రీలో మాత్రమే లేదు బయట కూడా ఉంటుంది. మన ఇళ్లలో కూడా చూస్తాం. కానీ సామాన్యుల కాబట్టి అటెన్షన్ ఉండదు. దానిపై చర్చ జరగదు. మనోళ్లే కాబట్టి సర్దుకుపోతుంటాం.
అయితే రాజేంద్ర ప్రసాద్ మాదిరిగానే కోటా శ్రీనివాస రావు లాంటి కొందరు సినీ పెద్దలు తమ ఆప్తులను ముఖ్యంగా తాము బతికి ఉండగానే పిల్లలు చనిపోవడం తట్టుకోలేక ఇలాంటి మానసిక పరిస్థితిలోకి వెళ్లిపోయారని అభిప్రాయపడుతున్నారు. కన్న పిల్లలను కళ్ల ముందే పోగొట్టుకోవడం మనిషిని కుంగదీస్తుందని, ఉక్కిరి బిక్కిరి చేస్తుందని... ఒక్కో సారి ఊహించని, ఇతరులు అంగీకరించలేని రూపంలోకి వెళ్తుందని చెప్తున్నారు. ఇప్పుడు వీరి విషయంలో ఇదే జరిగిందని చెప్తున్నారు. ఇలాంటి వారు మానసిక ఆరోగ్యం కోసం ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిదని సూచిస్తూనే.. సినీ పరిశ్రమ పెద్దలు కూడా ఇలా మానసిక బాధతో కుమిలిపోతున్న వారిని సినిమా ఈవెంట్స్‌కు ఆహ్వానించకుండా ఉంటే బాగుంటుందని.. సినిమా ఫంక్షన్లకు దూరంగా ఉంచితే వారి గౌరవాన్ని కాపాడిన వారవుతారని కోరుతున్నారు.






