- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కమల్ హాసన్ కంటే రాజేంద్ర ప్రసాద్ గొప్ప నటుడు.. పోసాని ఆసక్తికర వ్యాఖ్యలు
కమల్ హాసన్ కంటే రాజేంద్రప్రసాద్ గొప్ప నటుడని పోసాని కృష్ణమురళి చెప్పుకోచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: నటుడు, దర్శకుడు, కథా రచయిత పోసాని కృష్ణమురళి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలువురు ప్రముఖ హీరోల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పోసాని మాట్లాడుతూ, "నేను ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన రోజుల్లో సూపర్ స్టార్ కృష్ణ గారంటే చాలా ఇష్టం. ఆయనకు నేను పెద్ద అభిమానిని. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి అంటే కూడా ఎంతో అభిమానం. ఆయన ఓ లెజెండరీ నటుడు. ఇప్పటికీ సూపర్ స్టార్‌గానే కొనసాగుతున్నారు" అని అన్నారు. అలాగే నటుడు రాజేంద్రప్రసాద్ గురించి మాట్లాడుతూ, "ఆర్టిస్టుగా నాకు రాజేంద్రప్రసాద్ అంటే చాలా ఇష్టం. దర్శకుడు ఓ కామెడీ సన్నివేశం చెబితే క్షణాల్లో అద్భుతంగా నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించగలరు.
అదే తర్వాతి నిమిషంలోనే విషాద సన్నివేశం చేయమంటే అంతే సహజంగా నటించి ప్రేక్షకుల కళ్లలో నీళ్లు తెప్పించగలరు. అలా క్షణాల్లోనే నవ్వించడమే కాకుండా ఏడిపించే అరుదైన నటుడు ఆయన" అని ప్రశంసించారు. ఇంకా మాట్లాడుతూ, "నన్ను ఎవరైనా కమల్ హాసన్ గొప్ప నటుడా? లేక రాజేంద్రప్రసాద్ గొప్ప నటుడా? అని అడిగితే నేను రాజేంద్రప్రసాద్ పేరే చెబుతాను. ఎందుకంటే రాజేంద్రప్రసాద్ ఎలాంటి రిహార్సల్స్ లేకుండానే ఏ సన్నివేశాన్నైనా అద్భుతంగా చేయగలరు. కమల్ హాసన్ మాత్రం కొన్ని సన్నివేశాలకు రిహార్సల్స్ చేస్తారు" అని పోసాని కృష్ణమురళి పేర్కొన్నారు.






