ముసలి ము** కొడుకువి నువ్వు.. బ్రహ్మానందంపై రాజేంద్రప్రసాద్ బూతుపురాణం

by Ajay Maddhiboyina |

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవలికాలంలో తరచూ బూతులతో వార్తల్లో నిలుస్తున్నారు. ఒకప్పుడు స్టేజిలపై సాధారణంగానే మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్ ఇటీవల మాత్రం రెచ్చిపోతున్నారు. కొద్దిరోజుల క్రితం కమెడియన్ అలీని అలీ ఎక్కడ..

ముసలి ము** కొడుకువి నువ్వు.. బ్రహ్మానందంపై రాజేంద్రప్రసాద్ బూతుపురాణం
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవలికాలంలో తరచూ బూతులతో వార్తల్లో నిలుస్తున్నారు. ఒకప్పుడు స్టేజిలపై సాధారణంగానే మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్ ఇటీవల మాత్రం రెచ్చిపోతున్నారు. కొద్దిరోజుల క్రితం కమెడియన్ అలీని అలీ ఎక్కడ.. ఇటు రా లం... అంటూ స్టేజిపైనే అందరి ముందు దారుణమైన బూతులు మాట్లాడారు. మరోవైపు రాబిన్ హుడ్ సినిమా ఫంక్షన్‌లో ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ను... డేవిడ్ వార్నర్ దొంగ ముం... కొడుకు అంటూ తిట్టారు. ఆ తరవాత రాజేంద్రప్రసాద్ తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

విదేశీయుడు ప్రముఖ క్రికెటర్‌‌తో ప్రవర్తించే తీరు అదేనా అని మండిపడ్డారు. వయసు పెరిగేకొద్దీ రాజేంద్ర ప్రసాద్ ఇలా ప్రవర్తిస్తున్నారు ఏంటి అని అంతా అనుకున్నారు. ఆయనకు వారితో చనువు ఉండొచ్చు కానీ పబ్లిక్ గా అలాంటి మాట్లాడటం ఏంటి అని సినీ ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పిన రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఓ సినిమా ఫంక్షన్‌లో బ్రహ్మానందంను పట్టుకుని నువ్వు ముసలి ము.. కొడుకువి కదా.. అంటూ వ్యాఖ్యానించారు. బ్రహ్మానందం ఎవరు అని అడగ్గా నేను అంటూ మళ్లీ సమాధానం ఇచ్చారు. బ్రహ్మానందం లైట్ తీసుకున్నా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story