Rajashekhar: ఎట్టకేలకు 'జెంటిల్‌మెన్' రిజెక్ట్ చేయడానికి రీజన్ చెప్పిన రాజశేఖర్

by Pulgam srinivas |

రాజశేఖర్ మాట్లాడుతూ… ‘అల్లరి ప్రియుడు’ సినిమా చేస్తున్న సమయంలోనే ‘జెంటిల్‌మెన్’ ఆఫర్ వచ్చింది. అయితే తేదీలు సర్దుబాటు చేయలేక ఆ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.

Rajashekhar: ఎట్టకేలకు జెంటిల్‌మెన్ రిజెక్ట్ చేయడానికి రీజన్ చెప్పిన రాజశేఖర్
X

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ తాజాగా శర్వానంద్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘బైకర్’ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 3న విడుదల చేయనున్న నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా రాజశేఖర్ అనేక ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా గతంలో తాను మిస్ చేసుకున్న కొన్ని ప్రముఖ సినిమాల గురించి ఆయన ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

చాలా సంవత్సరాల క్రితం దర్శకుడు శంకర్, హీరో అర్జున్‌తో తెరకెక్కించిన ‘జెంటిల్‌మెన్’ చిత్రం భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో మొదట హీరోగా రాజశేఖర్‌ను ఎంపిక చేయాలని భావించినట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజా ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించిన రాజశేఖర్, “అవును, ఆ సినిమాలో మొదట నన్నే హీరోగా తీసుకోవాలని శంకర్ గారు అనుకున్నారు.

అందులో భాగంగా నన్ను సంప్రదించారు. కానీ అదే సమయంలో నేను రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందుతున్న ‘అల్లరి ప్రియుడు’ సినిమాలో నటిస్తున్నాను. దాంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక ‘జెంటిల్‌మెన్’ సినిమా చేయలేకపోయాను” అని తెలిపారు. బైకర్ చిత్రం నుండి ఇప్పటివరకు విడుదల అయిన ప్రచార చిత్రాలు జనాల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధిస్తే రాజశేఖర్ కి మరిన్ని చిత్రాల్లో అవకాశాలు దక్కుతాయని జనాలు భావిస్తున్నారు.

Next Story