Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన్’ మూవీలో విలన్‌గా ఆ స్టార్ హీరో.. పర్ఫెక్ట్ సెలక్షన్ అంటున్న ఫ్యాన్స్

by Chukka Sudharani |

వరుస ఫ్లాప్స్ తర్వాత ‘రౌడీ జనార్ధన్’ అనే పవర్ ఫుల్ అండ్ పర్ఫెక్ట్ టైటిల్‌తో వచ్చేస్తున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ.

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన్’ మూవీలో విలన్‌గా ఆ స్టార్ హీరో.. పర్ఫెక్ట్ సెలక్షన్ అంటున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: వరుస ఫ్లాప్స్ తర్వాత ‘రౌడీ జనార్ధన్’ అనే పవర్ ఫుల్ అండ్ పర్ఫెక్ట్ టైటిల్‌తో వచ్చేస్తున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. రవికిరణ్ కోలా డైరెక్షన్‌లో రాబోతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది. దిల్ రాజు నిర్మిస్తున్నాడు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందబోతున్న ఈ మూవీ కోసం మేకర్స్ చాలా పెద్ద ప్లానింగ్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ రియల్ మాస్ ఎంటర్‌టైనర్ చిత్రం కోసం విలన్ క్యారెక్టర్‌లో ఓ స్టార్ హీరోను దింపే ప్రయత్నంలో ఉన్నారట చిత్ర బృందం.

సినీ ఇండస్ట్రీలో యాంగ్రీ మ్యాన్‌గా రాణిస్తున్న సీనియర్ నటుడు రాజశేఖర్‌ను విలన్ పాత్ర కోసం సంప్రదించగా.. కథ నచ్చడంతో ఆయన కూడా ఓకే చెప్పేసినట్లు తెలుస్తుంది. అయితే.. దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానప్పటికీ సీరియస్ రోల్స్‌లో రాజశేఖర్ అదరగొట్టేస్తారు కాబట్టి.. విజయ్ దేవరకొండ ‘రౌడీ జానర్ధన్’కు ఇది పర్ఫెక్ట్ సెలక్షన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు విజయ్ ఫ్యాన్స్. కాగా.. ఈ సినిమా దసరా స్పెషల్‌గా అక్టోబర్ 2 నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. లింక్


Next Story