- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజాసాబ్ నుంచి నాచే నాచే సాంగ్ ప్రోమో రిలీజ్.. ఫుల్ సాంగ్ వచ్చేది అప్పుడే..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి(Maruti) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ హారర్ థ్రిల్లర్ ‘ది రాజాసాబ్’(Raja Saab).

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి(Maruti) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ హారర్ థ్రిల్లర్ ‘ది రాజాసాబ్’(Raja Saab). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్(TG Vishwa Prasad) రూపొందిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్(Malavika Mohanan), రిద్ధి కుమార్(Riddhi Kumar), నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అయితే ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9న గ్రాండ్‌గా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ప్రమోషన్లలో భాగంగా చిత్ర యూనిట్ విడుదల చేసిన ‘రెబల్ సాబ్’ ‘సహానా సహానా’ సాంగ్స్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి ది మోస్ట్ అవైటెడ్ ‘నాచే నాచే’ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది. బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ చిత్రంగా నిలిచిన ‘డిస్కో డ్యాన్సర్’ మూవీలోని ‘నాచే నాచే’ సాంగ్‌ను రీమిక్స్ చేస్తూ, థమన్ ఇచ్చిన క్యాచీ ట్యూన్స్‌కు ప్రభాస్ అదిరిపోయే స్టెప్పులు వేయబోతున్నాడు.
ఇందులో భాగంగా తాజాగా ఈ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. పూర్తి కలర్‌ఫుల్ సాంగ్‌గా రాబోతున్న ఈ పాటలో ప్రభాస్ ముగ్గురు హీరోయిన్లతో చిందులు వేయనున్నాడు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ గ్లామర్ ఫీస్ట్ ఇవ్వడంతో పాటు ప్రభాస్‌తో స్టన్నింగ్ స్టెప్స్ వేయించబోతున్నారు. కాగా ఫుల్ సాంగ్ జనవరి 5వ తారీఖున రిలీజ్ కానుంది.






