Oscars: ఆస్కార్‌లో కొత్త విభాగం.. రాజమౌళి రియాక్షన్ ఏంటంటే? (ట్వీట్)

by Chukka Sudharani |

సినిమా రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డ్స్‌లో ఆస్కార్ (Oscars) ఒకటి.

Oscars: ఆస్కార్‌లో కొత్త విభాగం.. రాజమౌళి రియాక్షన్ ఏంటంటే? (ట్వీట్)
X

దిశ, సినిమా: సినిమా రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డ్స్‌లో ఆస్కార్ (Oscars) ఒకటి. తాజాగా ఈ ఆస్కార్‌లో మరో కేటగిరీ యాడ్ చేస్తూ.. అకాడమీ ట్వీట్ చేసింది. ఈ మేరకు ‘సినిమాల మాయాజాలంలో స్టంట్స్ ఎల్లప్పుడూ ఒక భాగం. ఇప్పుడు అవి ఆస్కార్లలో భాగం కానున్నాయి. 2028లో 100వ ఆస్కార్ అవార్డులతో ప్రారంభించి.. 2027లో విడుదలైన చిత్రాలను గౌరవిస్తూ అకాడమీ స్టంట్ డిజైన్‌(Stunt design)లో అచీవ్‌మెంట్ కోసం కొత్త వార్షిక అవార్డును తీసుకురావడం ఎంతో గౌరవంగా ఉంది’ అంటూ ట్వీట్ చేశారు. ఇందులో ‘ఆర్ఆర్ఆర్’ (RRR) ఇమేజ్‌ను కూడా ఉపయోగించింది అకాడమీ.

అయితే.. హాలీవుడ్ (Hollywood) సిమాల మధ్యలో మన తెలుగు చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ ఇమేజ్ తీసుకోవడంతో.. సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా.. దీనిపై దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) స్పందిస్తూ.. ‘ఎట్టకేలకు!!.. 100 సంవత్సరాల నిరీక్షణ తర్వాత!!! 2027లో విడుదలయ్యే చిత్రాలకు.. ఆస్కార్ అవార్డ్స్‌లో స్టంట్ డిజైన్ అనే కొత్త కేటగిరీని పెట్టడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ చారిత్రాత్మక గుర్తింపును సాధ్యం చేసినందుకు డేవిడ్ లీచ్, క్రిస్ ఓ'హారా అండ్ స్టంట్ కమ్యూనిటీకి, స్టంట్ పని శక్తిని గౌరవించినందుకు అకాడమీకి, CEO బిల్ క్రామెర్, అధ్యక్షురాలు జానెట్ యాంగ్‌లకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ప్రకటనలో మా ‘RRR’ మూవీ యాక్షన్ విజువల్‌ను పెట్టడం ఎంతో సంతోషంగా ఉంది’ అంటూ ట్వీట్ పెట్టారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ట్వీట్ వైరల్ అవుతోంది.

Next Story