- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్లోబెట్రోటర్ ఈవెంట్ పై రాజమౌళి అప్ డేట్.. అభిమానులకు కీలక రిక్వెస్ట్
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ప్రస్తుతం సినీ ప్రపంచంలోనే అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టుగా నిలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ప్రస్తుతం సినీ ప్రపంచంలోనే అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టుగా నిలుస్తోంది. వర్కింగ్ టైటిల్‌గా SSMB29గా పిలుస్తున్న ఈ సినిమా, గ్లోబల్ స్థాయిలో రూపొందుతున్న యాక్షన్ అడ్వెంచర్ ఎంటర్టైనర్‌గా భావిస్తున్నారు. హీరోయిన్‌గా బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా నటించనుండటం విశేషం. అయితే ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నప్పటికీ దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం అందుబాటులోకి రాలేదు. దీంతో మహేశ్ బాబు అభిమానులు తీవ్ర అసంతృప్తిగా ఉండటంతో ఈ నెల మొదటి వారం నుంచి అప్ డేట్స్ ఇస్తున్నారు.
ఇందులో భాగంగా విలన్ పాత్రకు సంబంధించిన చిత్రాన్ని విడుదల చేశారు. అలాగే భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్న గ్లోబెట్రోటర్ ఈవెంట్ సాంగ్ ను కూడా విడుదల చేయగా.. బుధవారం సాయంత్రం హీరోయిన్ ప్రియాంక చోప్రా కు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ నెల 15న భారీ ఎత్తున #గ్లోబెట్రోటర్ ఈవెంట్ నిర్వహించనుండగా.. దీనిపై ఈ రోజు దర్శకుడు రాజమౌళి కీలక అప్ డేట్ ఇచ్చారు. ఇందుకోసం ప్రత్యేకమైన వీడియోను విడుదల చేసిన ఆయన అందులో మాట్లాడుతూ.. నవంబర్ 15న జరిగే #గ్లోబెట్రోటర్ ఈవెంట్‌లో మీ అందరినీ చూడటం చాలా ఆనందంగా ఉంది.
ఈవెంట్ రోజున RFC ప్రధాన ద్వారం మూసివేయబడుతుంది. మీ ఎంట్రీ పాస్‌లోని సూచనలను అనుసరించండి. అందరికీ ఇబ్బంది లేని, సురక్షితమైన, సంతోషకరమైన అనుభవాన్ని అందించడానికి పోలీసులు, భద్రతా సిబ్బందితో సహకరించండి." అని రిక్వెస్ట్ చేశారు. కాగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొట్టమొదటి సారి ఓ సినిమా పరిచయ ఈవెంట్ కు ఓటీటీ లైవ్ స్ట్రీమింగ్ తీసుకోవడం ఇదే మొదటి సారి గా నిలుస్తుంది. ఈ ఈవెంట్ కోసం ఇప్పటికే అభిమానులకు ఉచితంగా పాసులు సైతం అందించారు.
ఇప్పటికే హైదరాబాద్, నైరోబి (కెన్యా) తదితర లొకేషన్లలో ఈ భారీ అంచనాలు ఉన్న సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని విజువల్ గ్రాండ్ ట్రీట్‌గా రూపొందిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. మహేశ్ బాబు 50వ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ప్రీ-లుక్ పోస్టర్ అభిమానుల్లో భారీ ఉత్కంఠ రేపింది. అధికారిక టైటిల్ ఇంకా ప్రకటించకపోయినా, ఈ సినిమా 2027 లో విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు చెబుతున్నాయి.






