Brahmanandam: ఆ ఒక్క సీన్ కోసం బ్రహ్మానందం రోజంతా ఏమి తినకుండా ఉన్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన రాజా గౌతమ్

by Phanindra |

వెయ్యికి పైగా సినిమాలలో నటించి అందర్ని మెప్పించాడు

Brahmanandam: ఆ ఒక్క సీన్ కోసం బ్రహ్మానందం రోజంతా ఏమి తినకుండా ఉన్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన  రాజా గౌతమ్
X

దిశ, వెబ్ డెస్క్ : సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం ( Brahmanandam ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన పేరు వినగానే ఎవరికైనా ముఖంపై చిరునవ్వు వచ్చేస్తుంది. ఇప్పటి వరకు వెయ్యికి పైగా సినిమాలలో నటించి అందర్ని మెప్పించాడు. అయితే, కొన్ని సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులును ఏడిపించారు. అలాంటి చిత్రాల్లో రంగమార్తాండ ( Rangamarthanda) కూడా ఒకటి. కృష్ణవంశీ డైరెక్షన్ లో ఓ మరాఠి మూవీకి రీమేక్ గా రూపొందిన రంగమార్తాండ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం ముఖ్య పాత్రలు పోషించారు. అప్పటి వరకు మనల్ని నవ్వించిన బ్రహ్మానందం ఆ సినిమాలో అందర్ని ఏడిపించేశాడు. అయితే, ఆ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనను బ్రహ్మానందం కొడుకు రాజా గౌతమ్ మీడియా ద్వారా తెలిపాడు.

రాజా గౌతమ్ ( Raja Goutham ) మాట్లాడుతూ.. " నాకు మా నాన్న చాలా ఇన్స్పిరేషన్. ఎందుకంటే, రంగమార్తాండ చిత్రంలో ఒక సీన్ లో ఏడ్చే సీన్ ఉంటుంది. ఆ సీన్ షూటింగ్ ముందు ఆయన ఇంట్లో భోజనం చేయలేదు. వెంటనే అమ్మను వెళ్లి అడిగితే ఈ రోజు తినను అన్నారని చెప్పింది. నేను షూటింగ్ దగ్గరికి వెళ్లి అడిగితే .. రేపు షూటింగ్ లో ఒక ఎమోషనల్ సీన్ ఉంది. ఆ సీన్ లో నీరసంగా కనిపించాలి. ఈ రోజంతా తినకుండా ఉంటేనే రేపు ఫేస్ లో ఆ ఎమోషన్ కనబడుతుంది అని చెప్పారు. ఆయన ఏంటి అనేది నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. కానీ, ఈ వయసులో కూడా నటన కోసం అంతలా కష్టపడుతున్నారు" అని తెలిపాడు.

Next Story