రాజ్-సామ్ బంధం నిజమే! ఇదిగో ఫోటోలు

by Muthe.Rajitha |

అక్కినేని నాగ చైతన్యతో విడిపోయాక ఆరోగ్యం, సినిమాలపై దృష్టి పెట్టింది సమంత.

రాజ్-సామ్ బంధం నిజమే! ఇదిగో ఫోటోలు
X

దిశ, వెబ్ డెస్క్ : అక్కినేని నాగ చైతన్యతో విడిపోయాక ఆరోగ్యం, సినిమాలపై దృష్టి పెట్టింది సమంత. అయితే నాగ చైతన్య నటి శోభితా దూళిపాళను వివాహం చేసుకోగా.. సమంత మాత్రం సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది. అయితే ఇటీవల సామ్ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో రిలేషన్ లోఉందనే వార్తలు ఇండస్ట్రీలో షికార్లు చేస్తున్నాయి. వారిద్దరూ దిగిన ఫోటోలు అప్పుడప్పుడూ అటు సామ్.. ఇటు రాజ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే.. అబ్బే అదేం లేదు అని దాటవేస్తూ వస్తున్నారు.

ఇటీవల దీపావళి వేడుకలను సమంత రాజ్ ఇంట జరుపుకోవడం కూడా ఈ గాసిప్పులకు బలాన్ని చేకూరిస్తే.. ఈరోజు సామ్ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలతో వీరి మధ్య బంధం నిజమేనని కంక్లూజన్ కి వచ్చారు సామ్ అభిమానులు. ఓ ఈవెంట్ సందర్భంగా దిగిన ఫోటోలను సమంతా పోస్ట్ చేస్తూ.. గత ఏడాదిన్నరగా తన జీవితంలో కొన్ని బోల్డ్ డెసిషన్స్ తీసుకున్నట్టు, అందుకు కృతజ్ఞతగా ఉన్నట్టు రాసుకొచ్చింది. ఇక ఆ ఫొటోల్లో కూడా రాజ్, సామ్ చాలా క్లోజ్ గా ఉండటంతో.. వీరి బంధాన్ని బహిరంగంగానే ప్రకటించారని ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ వర్గాల్లో హాట్ చర్చ నడుస్తోంది.

Next Story