ఏపీలో "రాహుల్ సిప్లిగంజ్" వన్ మెన్ షో

by velandi.Saikiran |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని తీరంలో గ్రాండ్ న్యూ ఇయర్ స్పెషల్ గా ది గ్రాండ్ కౌంటు డౌన్ బై అమిగోస్ మ్యూజికల్ కాన్సర్ట్

ఏపీలో రాహుల్ సిప్లిగంజ్ వన్ మెన్ షో
X

దిశ, వెబ్ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని తీరంలో గ్రాండ్ న్యూ ఇయర్ స్పెషల్ గా ది గ్రాండ్ కౌంటు డౌన్ బై అమిగోస్ మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించనున్నారు. ఇందులో రాహుల్ సిప్లిగంజ్ వన్ మెన్ షో కూడా జరగనుంది. గుంటూరు హైలాండ్ లో డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఏడు గంటలకు గ్రాండ్ గా ఈవెంట్ జరగనుంది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ స్పెషల్ న్యూ ఇయర్ అమిగోస్ నిర్వహిస్తోంది. ఈ సందర్బంగా ఈవెంట్ లోగోను పంజాగుట్ట సెంట్రల్ కొలంబస్ కాఫీ షాప్ లో ఆస్కార్ వినింగ్ సాంగ్ నాటు నాటు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విడుదల చేశారు.

ఈ సంద‌ర్భంగా అమిగోస్ ఈవెంట్ నిర్వాహకులు ప్రసన్న కుమార్ మాట్లాడారు.‘రాహుల్ సిప్లిగంజ్ తన పెళ్లి తరువాత చేస్తున్న మొదటి ఈవెంట్ ఇదే అవుతుందని వెల్ల‌డించారు. సామాన్యులు కూడా వచ్చి చూసి ఎంజాయ్ చేసేలా మా ఈవెంట్ ఉంటుందన్నారు. సరసమైన ధరలకే టికెట్లను అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ లోగో లాంచ్ కార్యక్రమానికి ప్రసన్న కుమార్, వెలగ సునీల్ కుమార్, వుయ్యురు కృష్ణ ప్రసాద్, ప్రియాంక దాసరి కడలి రాంబాబు పాల్గొన్నారు.

Next Story