Radhika Apte : పూరి సేతుప‌తి సినిమాలో రాధికా ఆప్టే.. ఫైనల్‌గా క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

by Chukka Sudharani |   (  Updated:2025-05-30 11:03:06  IST  )

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi), టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannath) కాంబినేషన్‌లో ఓ మూవీ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

Radhika Apte : పూరి సేతుప‌తి సినిమాలో రాధికా ఆప్టే.. ఫైనల్‌గా క్లారిటీ ఇచ్చిన బ్యూటీ
X

దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi), టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannath) కాంబినేషన్‌లో ఓ మూవీ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, స్టార్ హీరోయిన్ చార్మీ కౌర్ (Charmi Kaur) నిర్మిస్తున్నా ఈ సినిమాలో అలనాటి తార టబు ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఇక ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఇందులో బ్యూటీ రాధికా ఆప్టే (Radhika Apte) హీరోయిన్‌గా నటిస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి విదితమే.

అయితే.. తాజాగా ఈ వార్తలపై స్పందించిన హీరోయిన్ రాధికా ఆప్టే క్లారిటీ ఇచ్చింది. ‘నేను పూరీ జగన్నాథ్, మిజయ్ సేతుపతి సినిమాలో నటిస్తున్నట్లు మీడియాలో వ‌స్తున్న వార్తల్లో అస్సలు నిజం లేద‌ు. అంతే కాదు.. నేను ఈ సినిమాలో భాగమైనట్లు నాకే తెలియదు. దయచేసి ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయకండి. ఇలాంటి ఊహాగానాలు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.. అలాగే చాలా ఫన్నీగా అనిపిస్తాయి’ అంటూ చెప్పుకొచ్చింది ఈ బాలీవుడ్ బ్యూటీ.

Next Story