Raashi Khanna: ఇందులో నాది ఓ మాస్ ఉంది.. ఆయన నుంచి చాలా నేర్చుకున్నా.. హీరోయిన్ వైరల్ కామెంట్స్

by Chukka Sudharani |

నా మొదటి చిత్రం నుంచే పవన్ కల్యాణ్‌తో కలిసి సినిమా చేయాలని ఉండేది.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో నా కల నెరవేరింది అంటూ చెప్పుకొచ్చింది రాశీ ఖన్నా.

Raashi Khanna: ఇందులో నాది ఓ మాస్ ఉంది.. ఆయన నుంచి చాలా నేర్చుకున్నా.. హీరోయిన్ వైరల్ కామెంట్స్
X

దిశ, సినిమా: పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 19న థియేటర్స్‌లోకి అడుగుపెట్టనుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కలయికలో వస్తున్న చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించారు. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా విశేషాలు పంచుకుంది రాశీ ఖన్నా. ‘నిజం చెప్పాలంటే, పవన్ కల్యాణ్ గారి సినిమా అనగానే కథ కూడా వినకుండా ఎంతో ఉత్సాహంతో ఓకే చెప్పేశా. నేను నా మొదటి సినిమా చేస్తున్నప్పటి నుంచే ఆయనతో కలిసి ఒక్క సినిమా అయినా చేయాలి అనుకున్నాను. 'ఉస్తాద్ భగత్ సింగ్'తో నా కల నెరవేరింది. ఈ సినిమాలో నా పాత్ర చాలా మోడ్రన్‌గా ఉంటుంది. నా పాత్రకు మంచి క్యారెక్టరైజేషన్ ఉంటుంది. నాకు ఇందులో ఒక మాస్ సాంగ్ ఉంది.

నాకు డ్యాన్స్ అంటే ఇష్టం కాబట్టి, ఆ సాంగ్ షూటింగ్ చాలా ఎంజాయ్ చేశాను. పవన్ చాలా సింపుల్ పర్సన్, ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ కనిపిస్తారు. ఆయనలో ఒక తెలియని అమాయకత్వం ఉంది. తక్కువ మాట్లాడతారు.. కానీ, ప్రతి మాటలో విలువ ఉంటుంది. నాతో ప్రజా సేవ చేయమని చెప్పారు. పవన్ ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తారు. ఆయన నుంచి మానవత్వం నేర్చుకున్నాను. ఉస్తాద్ వేడుకలో స్టేజ్ మీద నుంచి పవన్ అభిమానులను చూస్తుంటే, ఆయనను ఒక దేవుడిలా ఆరాధిస్తున్నట్లు అనిపించింది’ అంటూ మరెన్నో విశేషాలు పంచుకుంది. ఇక ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం హిందీలో అక్షయ్ కుమార్‌తో ఒక సినిమా, 'ఫర్జీ 2' షో చేస్తున్నాను. అమెజాన్‌ సిరీస్‌లో ఒక పంజాబీ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాను, అందులో నా డైలాగ్స్ అన్నీ పంజాబీలోనే ఉంటాయి. తమిళ్ లో 'రౌడీ అండ్ కో' చేస్తున్నాను. తెలుగులో కూడా కొన్ని కథలు వింటున్నానని తెలిపారు.

Next Story