raashiikhanna: మనం లక్ష్యంతో పరిగెత్తినప్పుడు మార్పు ప్రారంభమవుతుంది.. నటి మోటివేషన్ పోస్ట్

by Kodari Anjali |

టాలీవుడ్ ముద్దుగుమ్మ రాశీ ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

raashiikhanna: మనం లక్ష్యంతో పరిగెత్తినప్పుడు మార్పు ప్రారంభమవుతుంది.. నటి మోటివేషన్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ముద్దుగుమ్మ రాశీ ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ కెరీర్ స్టార్టింగ్‌లో మంచి అవకాశాలు అందుకుని.. ఉత్తమ నటిగా పేరు సంపాదించుకుంది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే ఈ బ్యూటీ బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. తర్వాత ఈ బ్యూటీ అగ్ర హీరోల సరసన అవకాశం కొట్టేసింది.

బెంగాల్ టైగర్, జోరు, శివం, సుప్రీమ్, రాజా ది గ్రేట్, హైపర్, టచ్ చేసి చూడు, తొలిప్రేమ, శైత్కాన్కి, ఇమైక్కా నొడిగల్, అడంగా మారు, వెంకీ మామ, శ్రీనివాస కళ్యాణం వరల్డ్ ఫేమస్ లవర్, తిరు, పక్కా కమర్షియల్ వంటి తెలుగు తమిళ్, మలయాళం సినిమాల్లో నటించి.. తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. అలాగే తమిళ్ లో అరణ్మణై అనే సినిమాలో నటించి మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కెరీర్ ప్రారంభంలో కన్నా ఇప్పుడు రాశీ ఖన్నాకు సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టాయని చెప్పుకోవచ్చు.

ఇకపోతే ఈ హీరోయిన్ సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ.. ఓ వైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ తరచూ ఏదో ఒక పోస్టుతో ప్రేక్షకుల్ని అలరిస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ లైట్ కలర్ పింక్ కలర్ శారీలో ఫొటో షూట్ చేసింది. ఈ పిక్స్ అభిమానులతో పంచుకుని మోటివేషన్ కోట్ రాసుకొచ్చింది. ‘‘: అల మీద స్వారీ చేయకండి.. మనం లక్ష్యంతో పరిగెత్తినప్పుడు మార్పు ప్రారంభమవుతుంది’’ అంటూ వ్యాఖ్యలు జోడించింది.


Next Story