శర్వానంద్ ‘బైకర్’పై ప్రశంసల వర్షం కురిపించిన పీ.వి. సింధు

by Pulgam srinivas |

‘బైకర్’పై ప్రశంసల వర్షం.. చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపిన పీవీ సింధు

శర్వానంద్ ‘బైకర్’పై ప్రశంసల వర్షం కురిపించిన పీ.వి. సింధు
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యువ నటుడు శర్వానంద్ తాజాగా ‘బైకర్’ అనే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించాడు. గత వారం విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. దాంతో ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. సినిమా మంచి స్పందనను అందుకుంటుండటంతో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ చిత్రంపై సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం నాగార్జున ఈ సినిమా అద్భుతంగా ఉందంటూ తన సోషల్ మీడియా ఖాతాలో ప్రశంసలు కురిపించారు. ఇక తాజాగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీ.వి. సింధు కూడా ఈ సినిమాపై ప్రశంసలు వ్యక్తం చేశారు.

సోషల్ మీడియా ద్వారా స్పందించిన ఆమె, క్రీడాకారిణిగా తనకు ఈ సినిమా ఎంతో ప్రత్యేకంగా అనిపించిందని తెలిపారు. కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూ లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన పట్టుదల, వేగం, ఏకాగ్రత వంటి అంశాలు సినిమాలో బలంగా ప్రతిబింబించాయని ఆమె పేర్కొన్నారు. అలాగే ఈ సినిమా భారీ విజయాన్ని సాధించాలని ఆమె ఆకాంక్షించారు. ముఖ్యంగా హీరో శర్వానంద్ తో పాటు దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకర, హీరోయిన్ మాళవిక నాయర్ సహా మొత్తం చిత్రబృందానికి ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రంలో రాజశేఖర్ కీలక పాత్రలో నటించగా, ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వంశీ, ప్రమోద్ ఈ సినిమాను నిర్మించారు.




Next Story