- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pushpa-2:‘పుష్ప-2 మూవీ ఎఫెక్ట్’.. థియేటర్లలో మహిళలకు పూనిన అమ్మవారు(వీడియో వైరల్)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్(Director Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప-2 మూవీ(Pushpa 2 Movie) థియేటర్లలో సందడి చేస్తోంది.

దిశ,వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్(Director Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప-2 మూవీ(Pushpa 2 Movie) థియేటర్లలో సందడి చేస్తోంది. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీలో అల్లు అర్జున్(Allu Arjun), రష్మిక మందన్న(Rashmika Mandanna) పర్ఫామెన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అయితే ఈ మూవీ పాన్ ఇండియా మూవీ పుష్పకు సిక్వెల్‌గా వచ్చింది. పాన్ ఇండియా లెవల్‌లో విడుదలైన పుష్ప-2 తొలి షోతోనే హిట్ టాక్ సొంతం చేసుకుంది. తొలిరోజు ఈ మూవీకి భారీ కలెక్షన్లు వచ్చాయి. పుష్ప-2కి సంబంధించి తొలి రోజు రూ.294 కోట్ల కలెక్షన్లు వచ్చాయని మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇక ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలతో బన్నీ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. పుష్ప-2 జాతర సీక్వెన్స్‌లో మహిళలకు అమ్మవారు పూనిన సంఘటన రెండు చోట్ల చోటు చేసుకుంది. పుష్ప-2 జాతర సీక్వెన్స్‌లో మహిళలకు అమ్మవారు పునినట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. ఆ సన్నివేశం రన్ అవుతున్నప్పుడు పలువురు మహిళలకు అమ్మవారు పూనింది. దీంతో పక్క సీట్లలోని వారు మహిళలను శాంతింపజేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలను పుష్ప టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి.






