- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆమె ఈ పాత్రకు వందశాతం న్యాయం చేయగలదని నమ్మి తీసుకున్న.. హీరోయిన్‌పై పుష్పకా బాప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
టాలీవుడ్ హీరో నాగ చైతన్య(Naga chaitanya), నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’(Thandel).

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో నాగ చైతన్య(Naga chaitanya), నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’(Thandel). చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని.. అల్లు అరవింద్(Allu Aravind) సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్(Geeth Arts Banner)పై బన్నీ వాసు(Bunny Vasu) నిర్మిస్తున్నారు. యథార్థ ప్రేమ సంఘటన కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం లవర్స్ కానుకగా ఫిబ్రవరి 7న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్(Trailer), గ్లింప్స్(Glimps) ఆకట్టుకోగా.. సాంగ్స్(songs)కి అయితే ప్రత్యేక రెస్పాన్స్ వచ్చిందనే చెప్పుకోవచ్చు.
ఇక విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రస్తుతం ఈ మూవీ టీమ్ ప్రమోషన్ల జోరులో ఉన్నారు. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లు అరవింద్ నేచురల్ బ్యూటీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో సాయిపల్లవిని హీరోయిన్‌గా తీసుకోవడం నా నిర్ణయమే. ఇది కమర్షియల్ నిర్ణయమని చెప్పాలి. ఈ పాత్ర కోసం నేను ముంబాయి వెళ్లి ఎవరినీ తీసుకురాలేదు. అక్కడి నుంచి వచ్చిన వైట్ స్కిన్ అమ్మాయిలు ఈ పాత్రకు జీవం తీసుకురాలేరనిపించింది.
ఇది ఎన్నో భావేద్వేగాలతో కూడిన పాత్ర. ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోతుంది. ఇలాంటి గొప్ప పాత్రను నిజాయితీగా చేయాలి. సాయి పల్లవి అయితే వంద శాతం న్యాయం చేయగలదని నాకు అనిపించింది. ఆమె అసాధారమైన నటి. అందుకే ఆమెను ఎంపిక చేశాం. మేము అనుకున్నట్లుగానే ఆమె 100 శాతం న్యాయం చేసింది’ అని చెప్పుకొచ్చారు అల్లు అరవింద్. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.






