- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Allu Arjun: పుష్ప అనేది ఓ ఎమోషన్.. జీవితాంతం గుర్తుండి పోతుంది.. అల్లు అర్జున్ ఎమోషనల్ కామెంట్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), దర్శకుడు సుకుమార్(Sukumar) కలయికలో అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers), సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి నిర్మించిన ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘పుష్ప-2: ది రూల్’(Pushpa 2:

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), దర్శకుడు సుకుమార్(Sukumar) కలయికలో అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers), సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి నిర్మించిన ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘పుష్ప-2: ది రూల్’(Pushpa 2: The Rule). ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించారు. డిసెంబర్ 5న విడుదలై ప్రపంచ స్థాయిలో ఎంతటి గొప్ప విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇండియన్ సినిమాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘పుష్ప-2’ సరికొత్త రికార్డులు సృష్టించింది. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
కాగా ఈచిత్రం థ్యాంక్స్ మీట్ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈవేడుకలో పాల్గొన్న అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘‘పుష్ప జర్నీలో ఐదు నిమిషాల నుంచి ఐదేండ్ల వరకు పనిచేసిన అందరికీ నా కృతజ్క్షతలు. ఈ మూవీ పోస్టర్‌లో నా ఫోటో చూసుకున్న ప్రతిసారి.. నాపై ఈ టీమ్ అంతా చూపిన ప్రేమే కనిపిస్తుంది. వాళ్ళు ఎంతో కష్టపడి అద్బుతమైన సినిమా ఇచ్చారు. నిర్మాతలు రవి, నవీన్ లేకుంటే పుష్ప సాధ్యమయ్యేది కాదు. ఈ ఐదు సంవత్సరాలు ఎంతో బాగా చూసుకున్నారు. సెట్‌లో ఎవరూ లేకున్నా చెర్రీ లేకుండా పుష్ప షూటింగ్ జరగదు. ప్రతి డిపార్ట్‌మెంట్‌కు నా హృదయపూర్వక కృతజ్క్షతలు. దేవిశ్రీప్రసాద్ నా సాంగ్స్‌ను బిలియన్స్‌ల్లో చూపించాడు.
తన అద్భుతమైన సంగీతంతో సినిమాకు ఎనర్జీ ఇచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా ఆదరించిన పుష్ప అభిమానులకు నా థ్యాంక్స్. నేను సుకుమార్‌కు థ్యాంక్స్ చెప్పి వదిలేయలేను. ఎందుకంటే అందరికి హిట్ ఇచ్చేది దర్శకుడే. ఈ సినిమా విషయంలో అందరూ సుకుమార్‌కు థ్యాంక్స్ చెప్పాలి.పుష్ప అనేది ఓ ఎమోషన్.. జీవితాంతం గుర్తుండి పోతుంది’’ అని అన్నారు. అనంతరం దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ ‘‘మైత్రీ మూవీస్ చెర్రీ సలహాతోనే పుష్పను రెండు భాగాలుగా చేశాను.
ఆయన సలహా ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది. నాకు రంగస్థలం నుంచి ఇప్పటి వరకు వరుస హిట్స్ రావడానికి మైత్రీ మూవీస్ కారణం. ఈ విజయం వాళ్లదే. నాపేరు సుకుమార్ కాదు.. సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్. దేవి లేకుండా నేను సినిమా చేయలేను. భవిష్యత్‌లో కూడా చేయలేను. ఇక అల్లు అర్జున్ నాకు ఎంతో ఎనర్జీ ఇస్తాడు. ఈ ప్రపంచంలో నన్ను ఓ అద్బుతంలా భావించే వ్యక్తి అల్లు అర్జున్. ఈ సక్సెస్ క్రెడిట్ మొత్తం అల్లు అర్జున్‌దే. ఈ సినిమా సక్సెస్‌లో భాగం అయిన అందరికి నా కృతజ్ఞతలు’’ అని చెప్పుకొచ్చారు.






