- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘పుష్ప’ నటుడు ప్రధాన పాత్రలో సినిమా.. టైటిల్ పోస్టర్‌తో సినిమాపై మరింత హైప్
‘పుష్ప’ సినిమాతో టాలీవుడ్‌లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న నటుడు కేశవ్ ప్రధాన పాత్రలో ఓ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: ‘పుష్ప’ సినిమాతో టాలీవుడ్‌లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న నటుడు కేశవ్ ప్రధాన పాత్రలో ఓ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. హర్ష డైస్ డైస్ ఈ చిత్రానికి రచన అండ్ దర్శకత్వం వహిస్తున్నాడు. డైస్ ఆర్ట్ ఫిల్మ్స్ సమర్పిస్తుండగా.. హరీష్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 2023లోనే ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌తో పాటు పోస్టర్ రిలీజ్ చెయ్యగా.. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరో అప్డేట్ రాలేదు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. పుష్ప తర్వాత ఫుల్ రోల్‌లో నటుడు కేశవ్ నటిస్తున్న ఈ వైవిధ్యమైన చిత్రానికి ‘మటన’ అనే క్యాచీవ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ‘రక్తం.. శక్తి.. ప్రతీకారం.. ‘మటన్’ అనే ఒక తుఫాను రాబోతోంది.. వేట మొదలైంది... ఈసారి, అది అత్యంత క్రూరమైనదిగా ఉండబోతుంది’ అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ వైలెంట్‌గా కనిపిస్తూ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ను పెంచేస్తుంది. కాగా.. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల వివరాలు, టెక్నికల్ అప్డేట్స్ త్వరలో రానున్నాయి.






