- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘పుష్ప-2’ థ్యాంక్యూ మీట్ ఈవెంట్ అప్డేట్.. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ మీడియా ముందుకు ఐకాన్ స్టార్ (పోస్ట్)
అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) తెరకెక్కించిన తాజా చిత్రం ‘పుష్ప-2’(Pushpa-2).

దిశ, సినిమా: అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) తెరకెక్కించిన తాజా చిత్రం ‘పుష్ప-2’(Pushpa-2). ఇది ‘పుష్ప’(Pushpa)కి సీక్వెల్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల(Sree Leela) ‘కిస్సిక్’(Kissik) అనే ఐటెం సాంగ్‌లో చిందులేసింది. అయితే గత ఏడాది డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచి బాక్సాఫీస్ వద్ద రూ.1800 కోట్లకు పైగా కలెక్ట్ చేసి ఎన్నో రికార్డులను తిరగరాసింది. ఇక ఈ మూవీ రిలీజ్ టైంలో ఎన్నో వివాదాలు జరిగిన సంగతి తెలిసిందే.
అందులో మెయిన్‌గా చెప్పుకోవాల్సిందే సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన. ఈ ఘటనలో రేవతి(Revathi) అనే మహిళ చనిపోగా ఆమె కుమారుడు ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఘటనపై చిక్కడపల్లి(Chikkadapally) పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు కూడా చేశారు. అయితే ఒకరోజు చంచల్ గూడ జైల్లో ఉన్న బన్నీ నెక్ట్స్ డే బెయిల్‌పై బయటికి వచ్చాడు.
అయితే ఈ ఇన్సిడెంట్ తర్వాత బన్నీ ఒకసారి మాత్రమే మీడియా ముందుకు వచ్చాడు. చాలా వరకు కనిపించడమే మానేసాడు. ఈ క్రమంలో పుష్ప మూవీ టీమ్ సాలీడ్ అప్డేట్ ఇచ్చింది. పుష్ప-2 రూ.1800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఇంతటి ఇండస్ట్రీ హిట్ సాధించిన సందర్భంగా చిత్రబృదం నేడు సాయంత్రం థాంక్యూ మీట్ నిర్వహించబోతుంది.
అయితే ఈ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. ఈ విషయాన్ని మూవీటీమ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అయితే నేడు బన్నీ మీడియా ముందుకు రాబోతుండడంతో ఏం మాట్లాడతారా అని ఇటు ఫ్యాన్స్‌తో పాటు అటు సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాతో వైరల్‌గా మారింది.






