- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
pavani: నా ప్రశాంతమైన ముఖం ఎంత లోతైన ఆలోచనల్లో మునిగిపోయిందో కనిపిస్తోంది.. నెట్టింట ఐకాన్‌స్టార్ కుమార్తె పోస్ట్
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2 సినిమాలో పుష్పరాజ్ అన్న కూతురుగా నటించి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది పావని.

దిశ, వెబ్‌డెస్క్: సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2 సినిమాలో పుష్పరాజ్ అన్న కూతురుగా నటించి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది పావని. ఈ చిత్రంలో కావేరి పాత్రలో నటించి మంచి గుర్తింపు పొందింది. పుష్పరాజ్‌ను చిన్నాయన అని పిలుస్తూ కథను మలుపుతిప్పే పాత్రలో నటించింది. పావని నటనకు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. పుష్ప 2 సినిమా థాంక్స్ మీట్‌లో కూడా పావని కరణం తన అనుభవాలను పంచుకుంటూ భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా సుకుమార్ కు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. ఇకపోతే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. పుష్ప 2 మూవీతో పాటుగా పావని కరణం కిరాక్ పార్టీ, హిట్ 2, పరేషాన్, ఫైలం పిలగా వంటి సినిమాల్లో నటించింది. అంతేకాకుండా గాడ్స్ ఆఫ్ ధర్మపురి, సిన్, మోడరన్ లవ్ హైదరాబాద్, సివరపల్లి వంటి వెబ్ సిరీస్‌ల్లో కూడా అద్భుతమైన ప్రదర్శన కనబర్చింది.
సోషల్ మీడియాలో కూడా చాలా చురుగ్గా ఉంటూ తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులతో నిరంతరం కనెక్ట్ అవుతూ ఉంటుంది. తాజాగా ఈమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. లేటెస్ట్ ఫొటోలకు పంచుకుని.. ‘‘Pic1: నా ప్రశాంతమైన ముఖం ఎంత లోతుగా ఆలోచనల్లో మునిగిపోయిందో కనిపిస్తోంది. Pic2: నేను నిజంగా ఎంత తెలివితక్కువదాన్ని..Pic3,4,5: మళ్ళీ తప్పిపోయాను.. Pic6: తిరిగి తెలివితక్కువదానిలా కనిపిస్తున్నాను’’ అంటూ రాసుకొచ్చింది.






