- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మగాళ్లను మొక్కుకుంటూ కాదు తొక్కుకుంటూ పోతామంటూ.. పోస్టర్ వైరల్
అందరినీ నవ్వించేందుకు ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమా ‘పురుష:’. ఇప్పటి వరకు ఈ మూవీ టీం వదిలిన పోస్టర్స్, క్యాప్షన్స్, పెళ్లి, ఆడ, మగ, స్వేచ్ఛ అంటూ వదిలిన పాయింట్స్ చూస్తుంటే ఆద్యంతం నవ్వించే కథతో సిద్దం అవుతున్నట్టుగా కనిపిస్తోంది. తాజాగా వదిలిన

దిశ, సినిమా : అందరినీ నవ్వించేందుకు ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమా ‘పురుష:’. ఇప్పటి వరకు ఈ మూవీ టీం వదిలిన పోస్టర్స్, క్యాప్షన్స్, పెళ్లి, ఆడ, మగ, స్వేచ్ఛ అంటూ వదిలిన పాయింట్స్ చూస్తుంటే ఆద్యంతం నవ్వించే కథతో సిద్దం అవుతున్నట్టుగా కనిపిస్తోంది. తాజాగా వదిలిన మరో పోస్టర్ సినిమాపై ఇంట్రస్ట్ పెంచుతోంది. మగాళ్లను మొక్కుకుంటూ కాదు తొక్కుకుంటూ పోతామంటూ పోస్టర్‌పై రాసిన లైన్ సినిమాపై ఇంకాస్త ఆసక్తిని పెంచింది. ఈ మూవీ విడుదల వరకు ఇలాంటి మరిన్ని పోస్టర్లు వదిలి ఇంట్రస్ట్ పెంచనున్నారు మేకర్స్. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు, పవన్ బత్తులను హీరోగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘పురుష:’. వీరు వులవల దర్శకత్వం వహిస్తున్న మూవీ ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి బజ్ అయితే క్రియేట్ చేయగలిగింది. కసిరెడ్డి, సప్తగిరి పాత్రలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలువనుండగా.. వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్ కథానాయికలుగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, వి.టి.వి.గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ వంటి కమెడియన్స్ అందరినీ కడుపుబ్బా నవ్విస్తారని టీం చెబుతోంది. ఈ సినిమాకి సినిమాటోగ్రఫర్‌గా సతీష్ ముత్యాల, సంగీత దర్శకుడుగా శ్రవణ్ భరద్వాజ్, ఎడిటర్‌గా కోటి, ఆర్ట్ డైరెక్టర్ గా రవిబాబు దొండపాటి పని చేస్తున్నారు.






